దేశంలో దొంగలు, దోపిడీదార్లకు స్వేచ్ఛ

దేశంలో దొంగలు, దోపిడీదార్లకు స్వేచ్ఛ
కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారుపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఉద్ధవ్‌ వర్గం శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరే మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలు శిక్షపడటంపై ఆయన స్పందించారు. రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దయిందని, మన దేశంలో దొంగను దొంగ అనడం నేరంగా మారిందని ఉద్ధవ్‌ థాకరే వ్యాఖ్యానించారు. దేశంలో దొంగలు, దోపిడీదార్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, రాహుల్‌గాంధీకి మాత్రం శిక్ష పడిందని ఆయన ఎద్దేవా చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని నేరుగా కూనీ చేయడమేనని అన్నారు. దేశంలో అన్ని ప్రభుత్వ వ్యవస్థలు ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయని మండిపడ్డారు. నియంతృత్వానికి పొయ్యేకాలం వచ్చిందని, అందుకు ఇదే ఆరంభమని అన్నారు.