కబ్జాకు గురైన రోడ్డు, ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు

కబ్జాకు గురైన రోడ్డు, ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు

ముద్ర, జమ్మికుంట :జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ కాలనీ, హనుమండ్ల పల్లి కాలనీలోని 8,10 వార్డులకు చెందిన 50 కుటుంబాలు ఏళ్లుగా నడుస్తున్న దారిని కబ్జా చేసి ప్రహరి నిర్మించారు. దారి లేక ఇక్కట్లు పడుతూన్నామని అధికారులు, మున్సిపల్ పాలకవర్గం సభ్యులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన వారు నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరించారని కాలనీలోని నివాసం ఉండే కుటుంబాల వారు ఆరోపిస్తున్నారు. సమస్య పరిష్కరించి నడిచేందుకు దారి చూపాలని వేడుకుంటున్నాను. ఎన్నికల సమయంలో వరద కాలువ నిర్మించారు దాని పక్కన ఉన్న 12 ఫీట్లతో రోడ్డు వేస్తామన్న హామీని నెరవేర్చాలి. యజమాని రోడ్డును కబ్జా చేశాడు అని ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడంలేదని, అధికారులు విచారణ జరిగి రోడ్డు నిర్మించాలని కాలనీ ప్రజలు వేడుకుంటున్నారు.