మురిసిన మువ్వన్నెల జెండా

మురిసిన మువ్వన్నెల జెండా
  • ఘనంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు
  • పెరేడ్ గ్రౌండ్లో జెండాను ఆవిష్కరించిన మంత్రి గంగుల

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. స్థానిక పోలీస్ పేరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర బిసి సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జెండా ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల షకటాల ప్రదర్శనను తిలకించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు అవార్డులను అందజేశారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. అనంతరం పోలీస్ వందన స్వీకరణ అనంతరం జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి క్లుప్తంగా వివరించారు.

కరీంనగర్ కు మెడికల్ కాలేజీ, 122 కోట్లతో కేబుల్ బ్రిడ్జ్ 450 కోట్లతో మానేరు రివర్ ప్లాంట్ వేలకోట్లతో స్మార్ట్ సిటీ పనులు కొనసాగుతున్నాయి అన్నారు. 150 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు త్వరలో పూర్తి చేస్తామని వివరించారు. పంచాయితికార్యదర్శులకు క్రమబద్ధీకరణ ఉత్తర్వులను అందజేయడం జరిగింది అన్నారు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కెసిఆర్ కిట్టు వెనుకబడిన తరగతులకు లక్ష రూపాయల రుణ సహాయం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. జిల్లావ్యాప్తంగా వేలకోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇంతకుముందు ఉత్తర తెలంగాణ భవన్లో జిల్లా నేతలతో కలిసి మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ బి రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీస్ కమిషనరేట్లో సిపి ఎల్ సుబ్బారాయుడు జెండా ఆవిష్కరించి అనంతరం పోలీసు అమరవీరుల కుటుంబాలను సన్మానించారు.

డిసిసి కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్
 కార్యాలయంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి  కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, నగర అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నియోజకవర్గ నాయకులు రోహిత్ రావు ఆంజనేయులు గౌడ్, గోపి తో పాటు పలువురు పాల్గొన్నారు.

బిజెపి పార్లమెంటు ఆఫీసులో
బిజెపి పార్లమెంటు కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు అనంతరం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జ్ బోయినపల్లి ప్రవీణ్ రావు బాస సత్యనారాయణ రమణారెడ్డి లోకేష్ తోపాటు పలువురు పాల్గొన్నారు. దీంతోపాటు జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలతో పాటు అనేకచోట్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.