కనీవిని ఎరుగని రీతిలో...70 ఎకరాల్లో .. లక్ష మంది తో  చరిత్ర లో నిలిచిపోయేలా  సిఎం కేసీఆర్ సూర్యాపేట సభ 

కనీవిని ఎరుగని రీతిలో...70 ఎకరాల్లో .. లక్ష మంది తో  చరిత్ర లో నిలిచిపోయేలా  సిఎం కేసీఆర్ సూర్యాపేట సభ 

ఉమ్మడి నల్లగొండ జిల్లా కేసీఆర్ ఖిల్లా
సిఎం రాక కోసం ఆతృత గా ప్రజలు చూస్తున్న ఎదురు చూపులే దీనికి నిదర్శనం 
ఎగిరేది గులాబీ జెండా నే
12 కు 12 బీఆర్ఎస్ వే 
బీఆర్ఎస్ కు తిరుగులేదు కాంగ్రెస్ , భాజపాలకు స్థానం లేదు
మూడో సారీ  కేసీఆర్ సారే..  వచ్చేది మన సర్కారే
 రాష్ట్రం లో 119 స్థానాల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ కు తప్పా ప్రతిపక్షాలకు అభ్యర్థులే లేరు 
ఉమ్మడి జిల్లా శాసన సభ్యులు, ఎంపి, ఎమ్మెల్సీ లతో కలిసి సభా స్థలి ని పరిశీలించిన మంత్రి జగదీష్ రెడ్డి 
సూర్యాపేట లో ఈ నెల 20 న సి.ఎం పర్యటన సందర్భంగా సుమంగళి ఫంక్షన్ హాల్లో  బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం
ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, పాల్గొన్న సూర్యాపేట, నల్లగొండ జిల్లా ల శాసనసభ్యులు గాధరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్, నలమోతు భాస్కర్ రావ్, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, శానంపూడి సైది రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, యాదాద్రి జిల్లా జడ్పి చైర్మన్ సందీప్ రెడ్డి, గుజ్జా యుగంధర్ రావ్, రాష్ట్ర బీఆర్ఎస్ కార్యదర్శి వై. వీ.


ముద్ర ప్రతినిధి సూర్యాపేట: కాళేశ్వరం జలాలతో సూర్యాపేట నియోజకవర్గాన్ని  పచ్చగ మార్చిన అపరభగీరథడు  సిఎం కేసీఆర్ రాక కోసం సూర్యాపేట ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారని   సూర్యాపేట శాసన సభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఈనెల 20 న అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి  సిఎం కేసీఆర్ సూర్యాపేట కు వస్తున్న  సభ సందర్బంగా  తమ జీవితాలను మార్చిన మహా నేత కు స్వాగతం పలకడానికి ఆయన  మాటలు ప్రత్యక్షంగా వినడానికి  ఊర్లకు ఊర్లు స్వచ్చందంగా ఏర్పాట్లు చేస్కుండటమే  వారి ఆతృతకు, ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రజలు కున్న ప్రేమా అభిమానులకు నిదర్శనం అన్నారు. ఈ నెల 20 న సిఎం కేసీఆర్ సూర్యాపేట పర్యటన సందర్భంగా సుమంగళి ఫంక్షన్ హాల్లో మంత్రి జగదీష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశం లో  నల్లగొండ జిల్లా కు చెందిన శాసన సభ్యులు, ఎంపి, ఎమ్మెల్సి, నియోజక వర్గ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, కనీవినీ ఎరుగని రీతిలో చరిత్ర లో నిలిచిపోయేలా  సిఎం సభ ఉంటుందని అన్నారు.. కొత్త మార్కెట్ సమీపం లో సుమారు  70ఎకరాల విస్తీర్ణం లో నిర్వహించ బోయే బహిరంగ సభ ను బీఆర్ ఎస్ శ్రేణులు విజయవంతం చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపు నిచ్చారు. 

మేము సింహాలమని మాకు ఎదురే లేదని విర్ర వీగిన కాంగ్రెస్ వృద్ద సింహాల ను మట్టికరిపించిన ఘనత సిఎం సారథ్యం లోని బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లది , బీఆర్ఎస్ శ్రేణుల దే అన్నారు. 12 కు 12 స్థానాలలో గులాబీ జెండా ఎగురవేసి ఉమ్మడి నల్లగొండ జిల్లా కేసీఆర్ ఖిల్లా గా మారిందన్నారు.. రాబోయే ఎన్నికల్లో కూడా ఉమ్మడి జిల్లా లో  12 స్థానాలోనూ ఎగిరేధి గులాబీ జెండా నే అని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడిగా, ఏమి కావాలో  తెలిసిన నాయకుడిగా కళ్యాణ లక్ష్మి, రైతు బంధు , రైతు బీమా,24 గంటల విద్యుత్ , ఆసరా పెన్షన్ల నుండి నిన్నటి రుణ మాఫీ వంటి పధకాలను తీసుకువచ్చి ప్రజల మనసులో సిఎం కేసీఆర్  సుస్థిర స్థానం పొందారని కొనియాడారు. పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజల కు సౌకర్యవంతంగా  ఉందేదుకు సూర్యాపేట ను జిల్లా గా మారవడమే కాదు, అందుకు అనుగుణంగా అద్భుతమైన సమీకృత కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీసు కార్యాలయ భవనం , మోడల్ మార్కెట్ తో పాటు , ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం మెడికల్ కాలేజ్ ను నిర్మించి సూర్యాపేట విశిష్టత ను కీర్తిని పెంచిన  ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అన్నారు.

 ఆయన రాక ను ప్రజలు పండుగలా భావిస్తున్నారని  అయన రాక కోసం వెయ్యి కళ్ళ తో ఎదురు చూస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.. కేసీఆర్ రాక సందర్బంగా లక్షలాది గా స్వచ్చందంగా తరలి వచ్చేందుకు సిద్దమవుతున్న ప్రజల కోసం బీఆర్ఎస్ శ్రేణులు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా లో బీఆర్ఎస్ కు తిరుగులేదన్న మంత్రి కాంగ్రెస్ , బిజెపి లకు స్థానమే లేదన్నారు. సమావేశంలో హాజరైన ఎంపీ లింగయ్య యాదవ్ గారు, ఎమ్మెల్యేలు డా.గాదరి కిశోర్ కుమార్ , బోల్లం మల్లయ్య యాదవ్ , శానంపుడి సైదిరెడ్డి , కంచర్ల భూపాల్ రెడ్డి , నోముల భగత్, కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి , చిరుమర్తి లింగయ్య , ఎన్.భాస్కర్ రావు , MLC కోటి రెడ్డి , జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి , డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, BRS నాయకులు   గుజ్జ యుగేందర్ రావు, నంద్యాల దయాకర్ రెడ్డి  BRS పార్టీ శ్రేణులు ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.