డ్రంక్ అండ్ డ్రైవ్లో 26 మంది పట్టివేత

డ్రంక్ అండ్ డ్రైవ్లో 26 మంది పట్టివేత

కౌన్సిలింగ్ ఇచ్చిన సిఐ నటేష్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న 26 మంది పట్టుబడ్డట్లు ట్రాఫిక్ ఎస్ ఐ రామచంద్రము తెలిపారు. జగిత్యాలలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 26 మందిని పట్టుకొన్నామని వీరందరినీ కోర్టులో హాజరుపరుచగా వీరందరికి కోర్టు 26 వేల జరిమానా విధించడం జరిగిందని ట్రాఫిక్ ఎస్ ఐ పేర్కొన్నారు.

వీరందరికి సి.ఐ. నటేష్ కుమార్ కౌన్సిలింగ్ ఇచ్చారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిగే ప్రమాదాల్లో మీపై ఆధారపడ్డ కుటుంబాలు ఇబ్బందుల్లో పడతాయని సి.ఐ. అన్నారు. ఇలాంటి తప్పిదాలు మరోసారి చేసేముందు మీపై మీ కుటుంబాలు ఆదారపడ్డాయన్న విషయాన్ని మరిచిపోరాదని సి.ఐ. నటేష్ కుమార్ హితబోధ చేశారు.