ఘనంగా బాబు జగజీవన్ రామ్ వర్ధంతి వేడుకలు 

ఘనంగా బాబు జగజీవన్ రామ్ వర్ధంతి వేడుకలు 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలో భారత దేశ మాజీ ఉప ప్రదాని  బాబు జగజీవన్ రామ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహిచారు. దళిత సంఘాల అధ్వర్యంలో పట్టణంలోని మంచి నీళ్ల బావి చౌరస్థలో బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ  బాబు జగజీవన్ రామ్ దేశంలోని అణగారిన, దళిత గిరిజన, బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సేవలు అందించారని  కొనియాడారు. అలాంటి గొప్ప నాయకుని అడుగు జాడల్లో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నక్క జీవన్, ఎస్సీ, ఎస్టి మానిటరింగ్ సభ్యుడు దుమాల రాజుకుమారు, మాజీ కౌన్సిలర్ బాలే శంకర్, బొల్లి శేకర్, మ్యాకల పవన్, మల్యాల అనిల్, బోల్లరపు దివాకర్ తదితరులు పాల్గొన్నారు.