ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేద్రంలోని పాత బస్టాండులో ఏబీవీపీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కరీనగర్ విభాగ్ ప్రముఖ్ అన్నాళదాస్ మురళి మాట్లాడుతూ ఏబీవీపీ 1949 జులై 9న ఢిల్లీ యూనివర్సిటీలో పురుడుపోసుకొని దేశంలోనే అతిపెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్ గా ఏబీవీపీ విరాజిల్లుతుందని, ఒక యూనివర్సిటీలో పురుడు పోసుకొని దేశంలో 7000 ప్రాంతాల్లో, 864 యూనివర్సిటీలో ఏబీవీపీ పని చేస్తుందని అన్నారు. జ్ఞానం శీలం ఏకత, అనే మూడు పదాలను వేదాలుగా మలుచుకొని జాతీయ పునర్నిర్మానం కోసం జాతీయ పునర్నిర్మాణం లక్ష్యంగా చేసుకొని, స్వామి వివేకానందనీ స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థి పరిషత్ పని చేస్తుందని అన్నారు. దేశంలో విద్యారంగ సమస్యలతో పాటు విపత్కర పరిస్థితి వచ్చినా ఆ సమస్యను పరిష్కరించడంలో ఏబీవీపీ ముందుండి పనిచేస్తుందని అన్నారు. ఏబీవీపీ, జాతీయ జెండా కోసం ఈ దేశంలో ఎంతోమంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అమరులయ్యరని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యాసమితి సభ్యుడు రాపాక సాయికుమార్, నగర కార్యదర్శి నందు, జిల్లా హాస్టల్స్  కన్వినర్ శ్రీను, వినయ్, మనోహర్, విజయ్, ప్రశాంత్, సుహాస్, శ్రవణ్, రాకేష్, పూర్వ కార్యాకర్తలు పుప్పాల సత్యనారాయణ, ఎసిఎస్  రాజు, సంపూర్ణచారి, సెపెల్లి రవీందర్, రెంటం జగదీష్,చింత అనిల్, అశోక్, మల్లేష్, మహేందర్, మహేష్, గంగాధర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.