ఆయిల్ ఫామ్ సాగు చేయాలనుకునే రైతులకు దరఖాస్తులు ఆహ్వానం

ఆయిల్ ఫామ్ సాగు చేయాలనుకునే రైతులకు దరఖాస్తులు ఆహ్వానం

ముద్ర, బోయినిపల్లి; రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో ఆయిల్ పామ్ సాగు చేయడానికి రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తూ ఆయిల్ ఫామ్ సాగు చేయాలనుకునే ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని మండల వ్యవసాయ అధికారిని ప్రణీత ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ అధికారిని ప్రణీత మాట్లాడుతూ: డాక్యుమెంట్స్, రాయితీ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.ఆయిల్ పామ్ సాగు చేయడానికి ఆసక్తి ఉన్న రైతులు క్రింద తెలిపిన డాక్యుమెంట్లు జిరాక్స కాపీలను మరియు డిడి ఇచ్చి దరఖాస్తు చేసుకోవలెను. ఆధార్ కార్డు జీరాక్స్,బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్, పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ కాపీ లేదా 1-బి కాపీ జిరాక్స్,పాస్ పోర్ట్ సైజు ఫోటో-3 ఇవ్వాలన్నారు. డిహెచ్ఓ రాజన్న సిరిసిల్ల చిరునామా మీద డిడి తీయాలన్నారు.ఆయిల్ పామ్ సాగుకు ఉద్యాన శాఖ రాయితిలు అందిస్తానన్నారు. ఒక మొక్క ఖరీదు 193 రూపాయలు దానిలో రైతు చెల్లించవలసినది 20 రూ.లు మాత్రమే.మిగిలినది ప్రభుత్వం రాయితి అందిస్తుంది.

ఎకరానికి 50 మొక్కలు.( రైతు వాటా 20 × 50 = 1000.ఎకరానికి 1000 రూపాయలు)4 సంవత్సరాల వరకు ఆయిల్ పామ్ సాగు మరియు అంతర పంటల సాగు నిర్వహణ ఖర్చు ఇవ్వబడుతుంది.( ఆయిల్ పామ్ సాగుకు రూ. 2100 ఎకరాకు మరియు అంతర పంట సాగుకు రూ.2100 ఎకరాకు.మొత్తం ఎకరానికి 4200 రూ.లు సంవత్సరానికి ప్రభుత్వం నేరుగా రైతు ఖాతాలో వేస్తుంది).రెండవ సంవత్సరం పైన తెలిపినవిధంగా ఎకరానికి 4200 రూ.లు ఇస్తుంది. మూడవ సంవత్సరం పైన తెలిపిన విధంగా ఎకరానికి 4200 రూ.లు ఇస్తుంది.నాల్గవ సంవత్సరం పైన తెలిపిన విధంగా ఎకరానికి 4200 రూ.లు ఇస్తుంది.డ్రిప్ సేద్యం ద్వారా నీరు అందించుటకు 80% నుండి 100% వరకు రైతు కేటగిరిననుసరించి రాయితీ యివ్వబడును.తోట నాటిన 3 సంవత్సరాల తర్వాత దిగుబడి ప్రారంభమై,25 సంవత్సరాల వరకు కొనసాగును.

మొదటి 3 సంవత్సరాల వరకు అన్ని రకాల కూరగాయలు, వేరుశనగ,సొయా,ప్రత్తి,పెసర, మినుములు,శనగ,కుసుమ, పసుపు,జొన్నలు,మక్కలు, సజ్జ,ఎర్ర జొన్నలు మొదలగు మెట్ట పంటలను అంతరపంటలుగా వేసుకోవచ్చు.గమనిక:వరి మరియు చెరుకు పంటను అంతర పంటలుగా సాగు చేయరాదు.నాలుగు సంవత్సరాల తర్వాత కూడా దుక్కి దున్నకుండా అంతర పంటలుగా కోకో,మిరియాలు, జనిజాపత్రి సాగు చేయవచ్చు. అలాగే దేశీ కోళ్లు,పాడి పరిశ్రమ,మేకల పెంపకం చేయవచ్చు.పది నుండి పదిహేను వేల పెట్టుబడితో ఒక ఎకరానికి 10 టన్నుల దిగుబడి మరియు ఒక(1)లక్ష రూపాయల ఆదాయాన్ని పొందవచ్చుని,మరిన్ని వివరాలకు ఆయా గ్రామాలలో మండల విస్తరణ అధికారులను కలిసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.