రోడ్డు మరమ్మత్తుకోసం బిక్షాటన చేసిన కాంగ్రెస్ నాయకులు...

రోడ్డు మరమ్మత్తుకోసం బిక్షాటన చేసిన కాంగ్రెస్ నాయకులు...
  • ఎమ్మెల్యే దత్తత గ్రామం మరిచాపోయారు...
  • ఓట్ల కోసమే  దత్తత గ్రామం..
  • కాంగ్రెస్ నాయకుల విమర్శలు..

ముద్ర, రుద్రంగి: రాజన్న  సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారి గుంతల మాయం కావడంతో దానిని నిరసిస్తూ రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  రోడ్డు మరమ్మత్తుల కోసం వినూత్న నిరసన చేపట్టారు.. మండల కేంద్రంలోని దుకాణాలు తిరుగుతూ భిక్షాటన చేసారు... వచ్చిన డబ్బులు జమ చేసిన కాంగ్రెస్ నాయకులు జమచేసిన డబ్బులతో రోడ్డుపై గుంతలను మట్టితో చదును చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యే కి అలాగే స్థానిక నాయకులకు బుద్ధి వచ్చే విదంగా రోడ్డు మరమ్మతుల కోసం బిక్షాటన చేపట్టామని అన్నారు.ప్రజలు కూడా రోడ్డు బాగు కోసం డబ్బులు ఇవ్వడానికి ముందుకు వచ్చారని కానీ ఎమ్మెల్యే రమేష్ బాబు కు మాత్రం ఈ రోడ్డుపై తిరిగెటప్పుడే రోడ్డు బాగు చెపిద్దాం అనే ఆలోచన ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదని అన్నారు.దత్తత గ్రామంలో ప్రయాణికులు ప్రజలు రోడ్డు వల్ల ఇబ్బందులు పడుతున్న ఎమ్మెల్యే చోద్యం చూస్తున్నారని అన్నారు.అసలు ఎమ్మెల్యే కి రుద్రంగి గ్రామం దాత్తత గ్రామం అని గుర్తుకు ఉందా అని అన్నారు.. గత సంవత్సరం బతుకమ్మ పండుగ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు రోడ్డు బాగుకోసం  నిధులు తెస్తున్నానని ప్రజలను మోసం చేసారని అన్నారు... కాగా రోడ్డు పడవటం వాళ్ళ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

దత్తత తీసుకున్న గ్రామాన్ని గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధికి పాల్పడకుండా కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలతో స్థానిక రుద్రంగి మండల ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు..గత మూడు సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి డివైడర్ రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థ లేకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా కేవలం సెంటర్ లైటింగ్ మాత్రం పెట్టి ఊరుకోవడం జరిగినది కావున ఇప్పటికైనా టిఆర్ఎస్ నాయకులకు ఎమ్మెల్యే కి కనువిప్పు కలిగి ఈ ఎన్నికల దృష్ట్యానైనా రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  రాజన్న సిరిసిల్ల డిసిసి కార్యదర్శి చెలుకల తిరుపతి,గ్రామ శాఖ అధ్యక్షులు సామ మోహన్ రెడ్డి,మండల కాంగ్రెస్ శాఖ ఉపాధ్యక్షులు తరె మనోహర్, కాంగ్రెస్ నాయకులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి,తర్రే లింగం, గండి నారాయణ,కట్కూరి దాసు,పరంధాములు,అభిలాష్ మనోజ్, పల్లి గంగాధర్,యాదగిరి మధు,అక్కనిపల్లి శ్రీనివాస్,దువ్వాక గంగాధర్ ద్యావలాదిలీప్,సన్నీ తదితరులు పాల్గొన్నారు..