ముగింపు బహిరంగ సభను విజయవంతం చేయండి

ముగింపు బహిరంగ సభను విజయవంతం చేయండి

  • మండల కేంద్రంలో కరపత్రాలు విడుదల చేసిన సిపిఎం పార్టీ శాఖ

ముద్ర, బోయినిపల్లి:-రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం.సెప్టెంబర్ 17 ఆదివారం రోజున తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు ముగింపు సభను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విజయవంతం చేయాలని మండల సిపిఎం పార్టీ శాఖ పిలుపునివ్వడం జరుగుతుంది.దీనికి సంబంధించిన కరపత్రాలు బోయినిపల్లి మండల కేంద్రంలో విడుదల చేయడం జరిగింది.

మండల సీపీఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్ మాట్లాడుతూ: భూమి,భుక్తి కొరకు,వెట్టి చాకిరి విముక్తి కొరకు నైజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగ,మట్టి మనుషులు చేసిన మహోన్నత ఉద్యమము వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటము. ఇది కమ్యూనిస్టుల నాయకత్వములో కుల,మత ప్రాంత బేధము లేకుండా పీడిత వర్గము అంత ఐక్యము సాధించిన కీలక వర్గ పోరాటం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ పోరాటంలో సుమారు 4000 మంది కమ్యూనిస్టులు అమరులయ్యారు.3000 గ్రామాలలో గ్రామ రాజ్యాలు స్థాపించారు.వేలాది గ్రామాల్లో సాయుధ పోరాటం నడిచింది. 10 లక్షలు ఎకరాల భూమి భూస్వాముల వద్ద నుండి స్వాధీనం చేసుకుని,పీడిత ప్రజలకు పంచిపెట్టారు.వేల మంది కమ్యూనిస్టు యోధులు క్రూర నిర్బంధాన్ని అనుభవించారు.1946 నుండి సాగిన పోరాటం ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్ లో తెలంగాణ విలీనమైంది.నాటి పోరాట వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని సెప్టెంబర్ 10 నుండి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా సభలు సమావేశాలు,ర్యాలీలు నిర్వహించాలని,భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు), సిపిఐఎం పార్టీ పిలుపునిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షులు రామంచ అశోక్, ఎలిగేటి రాజశేఖర్, భాస్కర్, అలువల బాబు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.