దహన సంస్కారాలకు 10వేల నగదును అందజేసిన సర్పంచ్ వెంకటరెడ్డి

దహన సంస్కారాలకు 10వేల నగదును అందజేసిన సర్పంచ్ వెంకటరెడ్డి

ముద్ర,ఎల్లారెడ్డిపేట : కడుపేదరికంతో అనారోగ్యంతో బాధపడుతూ ఆకుల లక్ష్మి బుధవారం మృతి చెందింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఆకుల వేణు తల్లి లక్ష్మి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఎల్లారెడ్డిపేట తన స్వగృహంలో మృతి చెందింది.సమాచారం తెలుసుకున్న ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నే వూరి వెంకట్ రెడ్డి దహన సంస్కారాలకు 10వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. దాతలు ఎవరైనా ఉంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.