పార్టీ పేరు మార్చుకున్నరు తప్ప..  పేద ప్రజల బతుకులు మారలేదు

పార్టీ పేరు మార్చుకున్నరు తప్ప..  పేద ప్రజల బతుకులు మారలేదు
  • సిరిసిల్ల  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల:బంగారు తెలంగాణ పేరు చెప్పి అధికారంలోకి వచ్చి... టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా పేరు మార్చి ప్రజల కష్టాలు గాలికి వదిలేశారన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్  తెలంగాణ  వస్తె ధర్నాలు,సమ్మెలు ఉండవన్న కేసీఅర్ .. రాష్ట్రంలో ఉద్యోగులంతా ధర్నలు,సమ్మెలు చేసే పరిస్థితికి తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సిరిసిల్ల పట్టణంలో సమ్మె చేస్తున్న అంగన్వాడి ఉద్యోగులను కలిసి వారికి సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్ నేతలు అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు పల్లే ప్రజలందరూ మద్దతు ప్రకటిస్తున్నరు.. టిఆర్ఎస్ ప్రభుత్వం తప్ప.. టిఆర్ఎస్ ను టిఆర్ఎస్ గా పేరు మార్చి అధికార పార్టీ లీడర్లు బాగుపడ్డారు కానీ రాష్ట్ర ప్రజల బతుకులు మారలే..తెలంగాణ రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ అనే పదం ఉండదన్న కేసీఆర్ మాటలు ఏమైనయి ,ప్రజలను మోసం చేస్తున్న అధికార పార్టీని గట్టిగా నిలదిసే సమయం ఆసన్నమైంది ..అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పాలను గాలి కొదిల్చేస్తుండు..ఒక తల్లిని పాత్రను పోషిస్తూ పిల్లల బాగోగులు చూస్తున్న అంగన్వాడి ఉద్యోగులపై కేసీఆర్ కత్తి సాధింపు చర్యలు మానుకోవాలి..

కేంద్ర,రాష్ట్ర రెండు ప్రభుత్వ పోటీ పడి మరీ పేద ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి ..ఏ పనికైనా అంగన్వాడి ఉద్యోగులే కావాలి..కానీ మి కష్టంలో రాష్ట్ర ప్రభుత్వం పలు పంచు కోవడం లేదు,ఎన్నికల వచ్చినప్పుడే ఈ ప్రభుత్వం పని చేస్తాది..వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం,అంగన్వాడీలు చేస్తున్న సమ్మె గురించి రేవంత్ రెడ్డికి వివరించి మి సమస్యలపై పోరాడుతాం,రేపు సిరిసిల్ల పర్యటనకు వస్తున్న మంత్రి కెటిఆర్ ..వీరి దగ్గరికి రావాలి చర్చలు జరపాలి,ఇప్పటి రేపటి మంత్రి కేటీఆర్ పరిటాల సందర్భంగా అంగన్వాడీలను ఇబ్బందులకు చేస్తే కాంగ్రెస్ పార్టీ సహించేది లేదు.మెడికల్ కాలేజీ దగ్గరికే వెళ్ళి అంగన్వాడి ఉద్యోగులందరూ నిరసన చేయాలి,మి వెంటా మేమున్నం.  అండగా ఉంటామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.