రాజకీయ ‘ఉచ్చు’ లో సిరిసిల్ల సెస్

రాజకీయ ‘ఉచ్చు’ లో సిరిసిల్ల సెస్
  • వరుస వివాదాల్లో సెస్ చైర్మన్ ‘చిక్కాల’
  • సిరిసిల్ల సెస్ చుట్టు అలుముకుంటున్న రాజకీయాలు
  • పదవి లేనప్పుడు ఏడేండ్లు గా సైలెంట్
  • సెస్ చైర్మన్ అయ్యాకా.. వివాదాల్లోకి..
  • మంత్రి కేటీఆర్కు తలనొప్పిగా సెస్ చైర్మన్ చిక్కాల నిర్ణయాలు
  • మొన్న అనుచిత వాఖ్యలు..నిన్న విద్యుత్ కనెక్షన్లు తొలగింపు.. నేడు ఉద్యోగుల బదిలీలు
  • మంత్రి కేటీఆర్ పై పరోక్ష రీవేంజ్ తీసుకుంటున్నాడా..?
  • మంత్రి కేటీఆర్ కు ఓట్ల గండి కొట్టేందుకు సెస్ ద్వారా కుట్ర..?
  • సెస్ డైరక్టర్ల మాట వినకుండా సెస్ ఉద్యోగుల బదీలిలు..
  • పండగపూట పరేషాన్ లో సిరిసిల్ల సెస్ ఉద్యోగులు..
  • కార్మికుల హక్కులు.. సమస్యలు పరిష్కరించాలన్న యూనియన్ లీడర్లపై కక్ష సాధింపు చర్యలు
  • సెస్ ఉద్యోగుల బదిలీలు ఆపాలని బీఆర్ఎస్ లీడర్ల వద్దకు సెస్ ఉద్యోగులు
  • ఆమెరికాలో మంత్రి కేటీఆర్.. అయోమయంలో సిరిసిల్ల సెస్ ఉద్యోగులు

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: బీఆర్ఎస్ సీనియర్ నేత, సిరిసిల్ల (సెస్) సహకార విద్యుత్ సరఫరా సంఘం లిమిటెడ్ చైర్మన్ చిక్కాల రామారావు రాజన్నసిరిసిల్ల జిల్లాలో వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ప్రత్యేక్షంగా, పరోక్షంగా మంత్రి కేటీఆర్ కు రాబోయే ఎన్నికల్లో ఓట్లకు గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నరా..? మంత్రి కేటీఆర్పై చిక్కాలకు ఏమైన వ్యక్తిగత రాజకీయ విబేధాలు ఉన్నాయా..? అంతుచిక్కడం లేదు. సెస్ చెర్మన్ చిక్కాల రామారావు నిర్ణయాలపై.. ఆయన మాటల తీరుపై సిరిసిల్ల లో రాజకీయ చర్చ కొనసాగుతుంది.బీఆర్ఎస్ సర్కార్ లో తనకు ఏడేండ్లు పదవి ఇవ్వకుండా ఖాళీగా ఉంచిన కేటీఆర్ పై సిరిసిల్ల సెస్ లో పలు నిర్ణయాల ద్వారా.. ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి, మంత్రి కేటీఆర్ కు వ్యతిరేఖం చేద్దామని చూస్తున్నారా..? లేదా ఇతర కారణాలతో ఏమైన చేస్తున్నారా అంతుచిక్కడం లేదని బీఆర్ఎస్ శ్రేణులే పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ సర్కార్ ఏర్పాడ్డక చిక్కాల రామారావుకు పదవి ఇవ్వకుండా మంత్రి కేటీఆర్ దూరం పెట్టారు.

బీఆర్ఎస్ సీనియర్లే చిక్కాల కు పదవి ఇవ్వాలని రిక్వెస్ట్ చేయగా ఎట్టకేలాకు సిరిసిల్ల సెస్ చైర్మన్ పదవికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేటీఆర్ మేనభావ చీటీ నర్సింగరావు ను తంగళ్లపల్లి సెస్ డైరక్టర్ గా పోటీ చేస్తానంటే తప్పించి మరి చిక్కాల రామారావుకు కేటీఆర్ అవకాశం ఇచ్చారు. కానీ చిక్కాల రామారావు కొన్ని సంస్థగత నిర్ణయాలు ఇటు ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాకుండా మంత్రి కేటీఆర్ కు సైతం నష్టం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సెస్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించాక రామారావులో చాలా మార్పు వచ్చిందని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నరని పేర్కొంటున్నారు. వరుస వివాదాల్లో చిక్కుకుంటు సిరిసిల్ల జిల్లా లో వార్తాల్లో నిలుస్తున్నారు.

విజయోత్సవ ర్యాలీలోనే..

సెస్ చైర్మన్గా గెలిచిన.. మొదటి రోజే గంటల పరిధిలోనే విజయోత్సవ ర్యాలీలో తన విశ్వరూపం చూపించాడు. నేను సెస్ చైర్మన్ ఐన..నాకు వ్యతిరేఖం చేసిన.. మాట్లాడిని వారికి చుక్కలు చూపిస్తా అంటూ విమర్శల పాలయ్యారు.

పద్మశాలీయులపై అనుచిత వాఖ్యలు..

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ రాయితీకి సబంధించి కోర్టు అర్డర్ మంత్రి కేటీఆర్ ఆమెరికా నుంచి వచ్చేదాక ఆగాలని కోరినందుకు .. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రముఖులపై అనుచిత వాఖ్యలు చేసినట్లు తీవ్ర దుమారం రేపింది. మీ శాలోల్లు ఓట్లు వేస్తేనే మేం గెలుస్తున్నమా..? మీరు ఓట్లు వేస్తే వేయ్యండి లేకుంటే లేదు.. ముందు కరెంటు బిల్లులు కట్టండి అంటూ అంటూ మాట్లాడటంతో సిరిసిల్ల పద్మశాలీ నాయకులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వివాదం ఎక్కువ కావడంతో పలువురు బీఆర్ఎస్ లీడర్లు కల్పించుకోని సద్దుమనిగించారు. ఈ మాటలు నేను అనలేదు.. ఏమైన విడియో రికార్డులు ఉంటే చూపించండి అంటూ తప్పించుకున్నారు.

మంత్రి కేటీఆర్ చెప్పిన..

కమర్షియల్ రేటుతో విద్యుత్ బిల్లులు.. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకోని నేతన్నలకు ఉపాధీ కరువై ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సమయంలో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ రాయితీ కూడా ఎత్తేశారు. సిరిసిల్ల లో ఓ వ్యక్తి కోర్టుకు పోవడంతో ఎస్ఎస్ఐ యూనిట్లకు విద్యుత్ రాయితీ వర్తించకుండా పోవడంతో కోర్టు స్టే తెచ్చుకున్నారు. మంత్రి కేటీఆర్ కల్పించుకోని కోర్టు స్టే వచ్చినందువల్ల పాత పద్దతిలోనే విద్యుత్ బిల్లులు నేతన్నలు చెల్లించేలా చూడాలని సెస్కు సూచించగా.. మంత్రి మాటలు కూడా పట్టించుకోకుండా.. యూనిట్ కు రూ.8 చోప్పున కమర్షియల్ రేటు ప్రకారం కొట్టి రూ.లక్షల బిల్లులు వచ్చేలా చేస్తున్నారు. అధిక బిల్లులు రావడంతో నేత కార్మికులు చెల్లించకపోవడంతో విద్యుత్ కనెక్షన్లు తొలగించి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. దీంతో వందలాది మంది కార్మికుల ఉపాధీ కొల్పోనున్నారు.

పేదల ఇండ్లపై ఇదే తీరు..

సిరిసిల్ల సెస్ పాలకవర్గం కఠిన నిర్ణయంతో రాజన్నసిరిసిల్ల జిల్లాలో పేదలు ఒక నెల, రెండు నెలలు విద్యుత్ బిల్లులు చెల్లించకున్న రూ.1000, రూ.2వేలకు కూడా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నడు లేని విధంగా పాత విద్యుత్ బకాయిలతో పాటు.. కొత్తగా కరెంటు బిల్లుల వసూళ్లు ఇంత కఠినంగా వ్యవహరించడంపై పేద ప్రజల నుంచి వ్యతిరేఖత వ్యక్తం అవుతుంది. ఎన్నికల ముందు మంత్రి కేటీఆర్ కు ఈ సెస్ నిర్ణయం ఓటు బ్యాంకు పై తీవ్ర ప్రభావం చూపనుంది.

సెస్ ఉద్యోగుల బదిలీలా పరేషాన్.. ఆగమవుతున్న సెస్​ ఉద్యోగులు

సిరిసిల్ల సెస్ పరిధిలో ఉద్యోగుల బదిలీల పరేషాన్ నెలకొంది. మొన్నటికి మొన్న సెస్ ఏఈలను బదిలీలు చేశారు. ఇష్టానుసారంగా.. తమకు ఇష్టం వచ్చిన వారిని దగ్గరగా.. మంచి పని చేసిన కూడా .. వారిని దూరంగా బదిలీ చేయడం విమర్శలకు దారి తీసింది. ప్రస్తుతం ఉద్యోగులందరిని బదిలీలు చేస్తున్నారు. చిన్న వేతనం ఉన్న అసిస్టెంటు హెల్పర్లను కూడా బదిలీలు చేయడం.. ఒక్కోక్కరిని 50 నుంచి 70కిలో మీటర్లు దూరం వేయడంతో పండగ పూట పరేషాన్ అవుతుండ్రు. ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఉన్నవారిని కూడా చూడకుండా..సీనియార్టీ లిస్టు ప్రకారం కాకుండా రాజకీయ బదిలీలకు పూనుకుంటున్నరన్న విమర్శలు వస్తున్నాయి. సెస్ లో పలు కుంబకోణాలు బయటపెట్టిన కార్మిక సంఘాల లీడర్లను కూడా టార్గెట్ చేసి దూర ప్రాంతాలకు బదిలీలు చేస్తుండటంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సెస్ లో ఇప్పుడు బదీలీలు చేస్తే తమ వేతనం రూ.17 వేలు పెట్రోల్ ఖర్చులకు, లోకల్ మీటర్ రీడింగ్ కొట్టడానికి.. రెండు మూడు గ్రామాల ఇంచార్జీ బాధ్యలు తీసుకోని తిరగడానికి సరిపోతుందని వాపోతున్నారు. తమ బదిలీలు ఆపాలని, చిన్న స్థాయి ఉద్యోగులను స్థానిక గ్రామాలకే..దగ్గరగా ఉంటేనే ఎక్కువ సేవలు అందించగలుతామంటున్నారు.సంస్థ పరంగా ఏ టార్గెట్ పెట్టిన దానిని చేస్తామని పేర్కొంటున్నారు. దూర ప్రాంతాలకు బదిలీలు చేసి మా పొట్ట కొట్టోదని వేడుకుంటున్నారు. ఈ విషయంలో సెస్ డైరక్టర్లు సెస్ చైర్మన్ చిక్కాల రామారావుకు పలు సూచనలు చేసిన పట్టించుకోవడం లేదని తెలిసింది.

ఏది ఏమైన సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామరావు నిర్ణయాలపై.. వాఖ్యలపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. మంత్రి కేటీఆర్కు సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తలనొప్పిగా మారారన్న చర్చ కొనసాగుతుంది. ఎన్నికల ముందు పార్టీకి, మంత్రి కేటీఆర్ కు నష్టం కలిగే నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నరని బీఆర్ఎస్ పార్టీలోనే చర్చ కొనసాగుతుంది. పలువురు చిక్కాల రామారావుపై బీఆర్ఎస్ ముఖ్యులతో పాటు సెస్ ఉద్యోగులు మంత్రి కేటీఆర్ కు వాట్సప్ మేసేజ్ ల ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.