అంధత్వ నివరణే ప్రభుత్వ లక్ష్యం...

అంధత్వ నివరణే ప్రభుత్వ లక్ష్యం...

బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతి..

ముద్ర రుద్రoగి: తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ అంధత్వ నివారణకు సీఎం కేసీఆర్‌ కంటి వెలుగు కార్యక్రమానికి కృషి చేస్తున్నారని  ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు దేగావత్ తిరుపతి అన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి మండలంలోని దేగావత్ తండా గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన రెండవ విడత కంటి వెలుగు కేంద్రాన్ని పరిశీలించి కంటి పరీక్షలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కంటి చూపు బాగుండాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.

18 సం.. పై బడిన వారంతా కంటి పరీక్షలు చేయించుకుని, ఉచిత మందులు కళ్ళద్దాలు పొందాలని అన్నారు. కంటి వెలుగు కేంద్రాలలో నిపుణులైన నేత్ర వైద్యులు కంటి పరీక్షలను జరిపి అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు, మందులను అందజేస్తారని,అన్నారు అవసరమైన వారికి శస్త్ర చికిత్సలను జరిపిస్తారని వినియోగించుకోవాలని  తెలిపారు.