ప్రజా ప్రతినిధులు సమావేశంలో ప్రస్తావించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ప్రజా ప్రతినిధులు సమావేశంలో ప్రస్తావించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి
Rajanna Sirisilala District ZP Chairperson Nyalakonda Aruna Raghava Reddy

రాజన్న సిరిసిలల  జిల్లా జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: ప్రజా సమస్యలు ఫిర్యాదుల పట్ల అధికారులు సత్వరమే స్పందించాలని...ప్రజా ప్రతినిధులు సమావేశంలో ప్రస్తావించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా  జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అధికారులకు సూచించారు. అంకిత భావంతో పనిచేసే అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధుల సంపూర్ణ సహకారం ఉంటుందని .... ప్రజా ప్రతినిధులు,అధికారులు జిల్లా అభివృద్ధికి కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు.సమస్య ఎక్కడున్నా అధికారులు స్పందిస్తూ స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం సహకారంతో సమస్యలను త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు.

గురువారం సిరిసిల్ల కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్ లో జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా గ్రామీణభివృద్ధి, వ్యవసాయం, విద్యా శాఖ, వైద్య, ఆరోగ్యం, పశు సంవర్డక శాఖ, పంచాయితీ రాజ్, మిషన్ భగీరథ, ఎస్సీ అభివృద్ధి శాఖ, ఎస్సీ కార్పొరేషన్, బిసి, ఎస్సీ అభివృద్ధి, సంక్షేమం, సెస్, రహదారులు,భవనాలు, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ విభాగాలు, ఇరిగేషన్ తదితర ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తమ ప్రగతి నివేదికను సభ్యుల ముందు ఉంచారు. సభ్యులు పలు అంశాలను లేవనెత్తగా వాటికి అధికారులు వివరణ ఇచ్చారు.

వైద్య , ఆరోగ్య శాఖ పనితీరు బాగుందని
అదే స్ఫూర్తిగా మరింతగా పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలని అన్నారు. మిషన్ భగీరథ పథకం అమలులో పలు గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యల్ని సభ్యులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఆ సమస్యల పై దృష్టి పెట్టి పరిష్కరించాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ మిషన్ భగీరథ ఇంజనీర్ లను ఆదేశించారు.వ్యవసాయ సాంప్రదాయ పద్ధతుల నుంచి బయటపడుతూ... వ్యవసాయ అనుబంధ రంగాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనపై దృష్టి సారించాలన్నారు. మినీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున రాయితీలు అందిస్తున్నందున జిల్లా రైతులు, ప్రజలు ఆ అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు.

దళిత బంధు పథకం ద్వారా దళితుల జీవితాల్లో అభివృద్ధి వెలుగులు నింపేలా భారీ ఆర్థిక సహాయం అందజేస్తుందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో వాటర్, హెల్త్ ఎడ్యుకేషన్ స్థిరీకరణ అయిందన్నారు. హెల్త్,ఎడ్యుకేషన్ సిస్టంలో రాజన్న సిరిసిల్ల జిల్లా దేశంలోనే ముందంజలో ఉండడం మనందరికీ గర్వకారణం అన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోనీ తొట్ట తొలి కేజీ టు పీజీ క్యాంపస్ ను మంత్రి శ్రీ కే తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభించుకోవడం మనందరికీ గర్వకారణం అన్నారు.కార్మిక క్షేత్రం సిరిసిల్ల ,ధార్మిక క్షేత్రం వేములవాడ నియోజకవర్గాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ చెందుతున్నాయన్నారు. ఈ సమావేశంలో మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్పీటీసీ లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.