బతుకమ్మ చీరల పంపిణీ - గ్రామపంచాయతీ కార్యాలయంలో అందజేత 

బతుకమ్మ చీరల పంపిణీ - గ్రామపంచాయతీ కార్యాలయంలో అందజేత 

ముద్ర,ఎల్లారెడ్డిపేట : బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలను సర్పంచ్ వెంకట్ రెడ్డి, జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, ఎంపీటీసీలు నాగరాణి,అనసూయ లు కలిసి అందజేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో  బతుకమ్మ చీరలను గ్రామంలోని మహిళలకు అందజేశారు.  ఈ సందర్భంగా జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా   తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించుకుంటారని ప్రతి మహిళ కు ఆడపడుచు కట్నంగా  చీరలను అన్ని మతాలకు,అన్ని కులాలకు  అందజేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. అదేవిధంగా రానున్న శాసనసభ ఎన్నికలలో ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ధ్యాగం నారాయణ, నేలకంటి దేవేందర్, జవాజి లింగం, ఎనగందుల అంజలి బాబు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్, మండల మహిళా అధ్యక్షురాలు అప్సర్ ఉన్నిసా అజ్జు, సీనియర్ నాయకులు మీసం రాజం, మేగి నరసయ్య, బాధ రమేష్, గంట వెంకటేష్, ఏఎంసి డైరెక్టర్ మెండే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.