విద్యుత్ లోవోల్టేజి  పరిష్కారానికి కృషి

విద్యుత్ లోవోల్టేజి  పరిష్కారానికి కృషి
  • సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి

ముద్ర,ఎల్లారెడ్డిపేట:విద్యుత్ లోవోల్టేజి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని మండల సెస్ డైరెక్టర్ వరుస కృష్ణా హరి అన్నారు.ఎల్లారెడ్డిపేట లోని అంబేద్కర్ నగర్ కాలనీలో మంగళవారం విద్యుత్ అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడానికి  ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పిటిసి చీటీ లక్ష్మణరావులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలను రైతులు మరిచిపోవద్దని కృతజ్ఞత భావంతో మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని అన్నారు. ఎల్లారెడ్డిపేట విద్యుత్ సబ్స్టేషన్ నుంచి అంబేద్కర్ నగర్ కాలనీవాసుల ఇండ్ల మీదుగా ఎల్లారెడ్డిపేట గ్రామ శివారులోని 200 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సరఫరా అయ్యే పదకొండు బై 33 కెవి హై టెన్షన్ విద్యుత్ లైన్ల వల్ల అంబేద్కర్ నగర్ కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను ఇబ్బందులను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని పేర్కొన్నారు. త్వరలోనే కేటీఆర్ హై టెన్షన్ విద్యుత్ లైన్ తొలగించడం జరుగుతుందని అని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయడం పట్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎనగందుల అనసూయ, ఏం సి చైర్మన్ ఎలుసాని మోహన్ కుమార్, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ నెవూరి వెంకట నరసింహారెడ్డి, మహిళ మండల అధ్యక్షురాలు అప్సర ఉన్నిసా, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్, పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, నాయకులు కొండ రమేష్ గౌడ్, అందే సుభాష్, పందిర్ల పరశురాం గౌడ్ గంట వెంకటేష్ గౌడ్, గుల్లపెల్లి నరసింహారెడ్డి, మాద ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.