చల్మెడ టాఫ్ గేర్..

చల్మెడ టాఫ్ గేర్..
  • వేములవాడ నియోజకవర్గంలో దూసుకుపోతున్న చల్మెడ
  • చెన్నమనేని వర్గమంతా చెల్మడ శిబిరంలోకి
  • అసంతృప్తి నేతల ఇంటికి వెళ్లి మరి చల్మెడ చర్చలు.. 
  • శాలువాలతో సత్కరించి.. మద్దతు కోరుతన్న వైనం
  • సారూ..కారును దృష్టిలో పెట్టుకోని వేములవాడ అభివృద్ది కోసం పనిచేద్దామంటున్న చల్మెడ
  • నిన్న మొన్నటిదాక వ్యతిరేఖించిన వారంత వెళ్లి చల్మెడను కలుస్తున్నారు
  • వేములవాడ లో ప్రజాప్రతినిధులతో చల్మెడ సమావేశం

ముద్ర ప్రతినిధి,రాజన్నసిరిసిల్ల:రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహారావు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. నిన్న మొన్నటి వరకు ఆచితూచి అడులేసిన చల్మెడ టికెట్ కన్ఫర్మ్ అవ్వడంతో టాప్ గేర్లో దూసుకుపోతున్నాడు. నియోజకవర్గమంత కలియతిరుగుతున్నాడు. మండలాలా వారిగా ప్రజాప్రతినిధులను కలిసి.. వారి మద్దతు కోరుతున్నాడు. చెన్నమనేని రమేశ్బాబు వర్గం నిన్న మొన్నటి వరకు చల్మెడను వ్యతిరేఖించిన టికెట్ చల్మెడకు కేటాయించడంతో చెన్నమనేని వర్గం కరీంనగర్ వెళ్లి మరి చల్మెడను వెళ్లి కలిసివస్తున్నారు.అసంతృప్తి నాయకుల ఇంటికి వెళ్లి మరి వారికి శాలువాతో సత్కరించి వారి మద్దతు కోరుతున్నాడు. తాను ఎవరికి వ్యతిరేఖం కాదని, బీఆర్ఎస్ అధిష్టానం పంపితినే వచ్చానని, వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబు ఆశీర్వాదంతోనే వేములవాడ గడ్డపై గూలాభి జెండా ఎగురవేసి వేములవాడ ఇప్పటికి జరిగిన అభివృద్దికంటే పది రెట్లు ఎక్కువ చేస్తానని చల్మెడ లక్ష్మీనరసింహారావు పేర్కొంటున్నారు.సారూ..కారు కోసం అందరు పని చేయాలన్నారు. పార్టీ కోసం అందరం పని చేయాలని సిఎం కేసీఆర్ ను మూడవసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిస్తున్నారు. సీనీయర్ల సహాలు, సూచనలు తీసుకోని ముందుకు వెళ్తానని,తనకు ఏకపక్ష నిర్ణయాలు అవసరం లేదన్నారు.

ప్రజా సేవ చేయడానికే వస్తున్ననని పేర్కొంటున్నారు. భగవంతుడి దయవల్ల, తన తండ్రి గారి ఆశీర్వాదంతో ఆర్థికంగా తమకు కష్టాలు లేవని, రాజకీయంగా తనకు రూపాయి అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినప్పటికి... వేములవాడ ప్రజల ఆశీర్వాదం.. ప్రజాప్రతినిధులు సహకారం తప్పక అవసరం అన్నారు.తాను ఎమ్మెల్యేగా గెలిచాక.. ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టి దాచుకుంటానని పేర్కొంటున్నారు. బేషజాలకు వెళ్లకుండా అందరిని కలుపకుపోతానని పేర్కొంటున్నారు. వేములవాడ నియోజకవరగ్ంలో ముఖ్య నాయకులంతా చల్మెడను శిబిరంలో చేరిపోయి పార్టీ లైన్లోకి వచ్చారు. జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ సైతం నిన్న మొన్నటి వరకు వేములవాడ రాజకీయాలకు దూరంగా ఉన్న చల్మెడ రాకతో యాక్టీవ్ అయ్యారు.  వేములవాడ పట్టణంలో మహాదేవ బంకేట్ హల్ లో వేములవాడ రూరల్, కోనరావుపేట మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి తన విజన్ వివరించారు. రాబోయే రోజుల్లో తాను ఏం చేస్తానో దిశా నిర్దేశం చేశారు. ఈ ఆత్మీయ సమావేశంలో  వేములవాడ రూరల్ జడ్పీటిసి ఏష వాణి తిరుపతి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డం హన్మాండ్లు, మార్క్ ఫెడ్ డైరెక్టర్ బండ నర్సయ్య, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు న్యాలకొండ రాఘవ రెడ్డి, జిల్లా సర్పంచ్లు ఫోరం కార్యదర్శి మంతెన సంతోష్, వేములవాడ రూరల్ మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఏష తిరుపతి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాల్ రెడ్డి,  వేములవాడ రూరల్ మండలం సర్పంచులు తిరుపతి, మొగిలి ఏళ్లవ్వ , జయపాల్ రెడ్డి, యమా సుమతి,  తిరుపతి, లచ్చన్న, సత్తన్న, లక్ష్మి, హుస్సేన్,  ఎంపీటీసీ లు నర్శవ్వ, తిరుపతి తో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.