ఆత్మహత్య చేసుకుంటానంటూ 100 డయల్ కి కాల్ చేసిన యువకుడు

ఆత్మహత్య చేసుకుంటానంటూ 100 డయల్ కి కాల్ చేసిన యువకుడు
  • రక్షించిన బోయినిపల్లి బ్లూ కోట్ సిబ్బంది

ముద్ర, బోయినిపల్లి:-రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక వద్ద శ్రీ రాజరాజేశ్వర (మధ్య మానేరు) జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకుంటానంటూ, కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన హఫీజ్ అనే యువకుడు100 డయల్ కి కాల్ చేయగా, స్పందించిన బ్లూ కోట్  సిబ్బంది కానిస్టేబుల్ సరేష్ కుమార్, హోంగార్డు వాసుదేవరావులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ యువకుడిని కాపాడి, కరీంనగర్ జ్యోతినగర్ కు  చెందిన యువకుని బావ ఎండి.గఫూర్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించి, ఆ యువకుడిని అప్పగించినట్లు తెలిపారు.