రెండవసారిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా రమణరెడ్డి

రెండవసారిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా రమణరెడ్డి

ముద్ర, బోయినిపల్లి:-రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రెండవ సారి నన్ను నియామకానికి కృషి చేసిన చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడిపల్లి సత్యం,నా నియామకానికి సహకరించిన మాజీ మంత్రివర్యులు ఏమ్మెల్సీ జీవన్ రెడ్డి,మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్,రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ లకు మరియు బోయినిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలిపిన వన్నెల రమణరెడ్డి.
ఈ సందర్భంగా వన్నెల రమణారెడ్డి మాట్లాడుతూ: నా మీద నమ్మకంతో నన్ను మండల కాంగ్రెస్ అధ్యక్షులు గా నియమించిన సందర్బంగా నేను బోయినిపల్లి మండలం లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని,అలాగే వచ్చే శాసనసభ,పార్లమెంట్ ఎన్నికల్లో బోయినిపల్లి మండలం నుండి మెజారిటీ వచ్చేవిధంగా,మండల కాంగ్రెస్ నాయకులతో కలసి పని చేస్తానని తెలిపారు.