యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులది.. -ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్..

యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులది..  -ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్..

ముద్ర, రుద్రoగి: యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులదే అని, మన జీవనశైలిలో చదువు, ఉద్యోగంతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మానాల, తండా గ్రామాలను శుక్రవారం సందర్శించి,  గ్రామస్థులతో సమావేశమై, గ్రామంలోని పరిస్థితులను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ..ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, ప్రజా శ్రేయస్సే పోలీసుల ద్యేయం అన్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎన్నో సౌకర్యాలు మెరుగు పడ్డాయని తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలను చక్కగా చదివించుకుని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సౌకర్యాలను సద్వినియొగం చేసుకోవాలన్నారు.యువత చెడు మార్గాల వైపు మరలకుండా వారితో మమేకమై కమ్యూనిటీ పోలీస్ లో భాగంగా వివిధ కార్యక్రమాలు పోలీస్ శాఖ తరపున నిర్వహించడాం జరుగుతుంది అన్నారు..యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది అన్నారు..యువత క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు.  క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయని, స్పోర్ట్స్ కోటా తో కూడా ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. క్రీడలతో శారీరక దారుఢ్యం పెరుగుతుందని, క్రీడల పోటీల నిర్వహణకు పోలీస్ శాఖ తరుపున యువతకు ఎల్లవేళలా సహకరించి, ప్రోత్సహిస్తామని అన్నారు.యువకులు గంజాయి, జూదం వంటి చెడు అలవాట్లకు, ఇతర చెడు మార్గాల వైపు మరలకుండా చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఉద్యోగాలు సంపాదించి, తమ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని, గ్రామానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఎస్పీ  ఆకాంక్షించారు.
గ్రామంలో అసాంఘిక శక్తులకు సంబంధించిన సమాచారమైనా పోలీసులకు అందించాలని కోరారు. పోలీస్ లు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ప్రజల భద్రతే మా భాద్యత అని  అన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మొబైల్ కి వచ్చిన లింక్స్ క్లిక్ చేయవద్దు అని ఎవరైనా కాల్ చేసి OTP చెప్పమంటే చెప్పవద్దు అన్నారు..ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు.ప్రతి తండాలో సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవాలని తద్వారా నేరాలు నియత్రించవచ్చు అన్నారు..అనంతరం కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా గ్రామంలోని యువకులకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ కిరణ్ ,ఎస్.ఐ ప్రభాకర్,మానాల & తండా గ్రామాల సర్పంచులు, ప్రజలు పాల్గొన్నారు...