ధాన్య భాండాగారంగా తెలంగాణ - నాప్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు

ధాన్య భాండాగారంగా తెలంగాణ - నాప్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు

ముద్ర, గంభీరావుపేట : రైతాంగానికి ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి కృషి చూస్తున్నా,  రైతులుకు కావలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చడంతో  తెలంగాణ రాష్ట్రం ధాన్య భాండాగారంగా విరసిల్లుతుందనీ నాప్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు అన్నారు. గంభీరావుపేట మండలం గోరింటాల గ్రామంలో నాబార్డ్ సహకారంతో గంభీరావుపేట ప్యాక్స్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న  రైస్ మిల్ కీ కొండూరి రవీందర్ రావు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కొండూరి రవీందర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు,  కుంటలు మరియు ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయని, ఎటు చూసినా  కనిపిస్తున్న  జలాలను చూసి  అందరూ సంబరపడుతున్నారని, దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల వల్ల కరువు ఉంటే, తెలంగాణ మాత్రం సీఎం దార్శనీకత తో సస్యశ్యామలంగా మారిందన్నారు. సమైక్య రాష్ట్రంలో  సమైక్య పాలకుల వివక్ష, నిర్లక్ష్యం మూలంగా తెలంగాణ వ్యవసాయ రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనైందన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని,దీంతో  ఏటా అంచనాలకు మించి పంటలు ఉత్పత్తి కావడంతో పాటు, దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా అవతరించిందన్నారు.  తెలంగాణలో ఉత్పత్తి ధాన్యం ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ స్కీములకు వాడుతున్నారని అన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీముల్లో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని,  అందులోనే భాగంగా నాబార్డ్ సహకారంతో గంభీరావుపేట ఫ్యాక్స్ ఆధ్వర్యంలో  తెలంగాణలో పైలెట్ ప్రాజెక్టుగా గోరంటాల గ్రామంలో మూడు కోట్ల 30 లక్షలతో అత్యాధునిక టెక్నాలజీతో రైస్ మిల్లు నిర్మిస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పవర్ లూమ్, టెక్స్ టైల్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, జిల్లా రైతు బంధు చైర్మన్ గడ్డం నర్సయ్య, జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య,  ఎంపీపీ కరుణ, జడ్పిటిసి విజయ,సెస్ డైరెక్టర్ నారాయణరావు,జడ్పీ కో ఆప్షన్ హైమద్, సర్పంచ్ అంజమ్మ, ఆర్బిఎస్ మండల కోఆర్డినేటర్ రాజేందర్,బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య,బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటస్వామి గౌడ్,ప్యాక్స్ వైస్ చైర్మన్ రామాంజనేయులు,నాయకులు రాజారాం, సురేందర్ రెడ్డి, లక్ష్మణ్, నాబార్డ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.