సెలక్షన్ అదిరింది.. ఈ యువ పోలీస్ అధికారుల జత కుదిరింది..

సెలక్షన్ అదిరింది.. ఈ యువ పోలీస్ అధికారుల జత కుదిరింది..
  • సిరిసిల్ల వరదల్లో రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ, డీఎస్పీల పనితీరు భేష్
  • సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్, డీఎస్పీ ఉదయ్రెడ్డి పై ప్రజల ప్రశంసలు..
  • ఉదయం నుంచి రాత్రి దాక.. సోషల్ మీడియాలో.. యువ పోలీస్ ఆఫీసర్ల పనితీరుపై చర్చ..
  • యువ పోలీసు అధికారుల పనితీరు తో పోలీసుల ఉరుకులు పరుగులు..
  • బారి వర్షంలో.. ఎస్పీ, డీఎస్పీలు కింది స్థాయి సిబ్బంది తో కలిసి సహాయాక చర్యలు..

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా లో బారి వర్షాలకు చిన్నబోనాల చెరువు కట్ట తెగి జలదిగ్బందంలో సిరిసిల్ల చిక్కుకోని బారి వరదలకు ప్రజలు అష్ట కష్టాలు పడ్డారు. వరద కష్టాల నుంచి ప్రజలను రక్షించేందుకు.. సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, డీఎస్పీ ఉదయ్రెడ్డిల పనితీరు పై ప్రజలు ప్రసంశలు కురిపించారు. సిరిసిల్ల వాట్సప్, పేస్బుక్ ఇతర సామాజిక మాద్యమాల్లో చర్చ పెట్టారు. ఇద్దరు యువ పోలీసు అధికారులు బారి వర్షంతో తడుస్తూ.. వరదల్లో ట్రాక్టర్లపై ప్రయాణం చేసి నేరుగా సహయా కార్యక్రమాల్లో పాల్గనడం అందరిని ఆకట్టుకుంది.బారి వరదలో ట్రాక్టర్ పై ప్రయాణం చేసి.. ప్రజలకు మనోధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.

200 మందికి పైగా ముంపు నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మున్సిపల్, రెవెన్యూ శాఖలతో సమన్వయం.. ఒక్క ప్రాణనష్టం కలగకుండా ఆపరేషన్ పూర్తి చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్, డీఎస్పీ ఉదయ్రెడ్డి, టౌన్ సిఐ ఉపేందర్లు వరదల నేపధ్యంలో గురువారం తెల్లవారు జామునే.. అలర్ట్ అయ్యారు. చంద్రంపేట ఈదుల చెరువు నుంచి.. చిన్నబోనాల చెరువు కట్ట తెగిన దగ్గరి నుంచి రాత్రి వరద ఉదృతి దాటేంత వరకు పోలీసుల కష్టం సోషల్ మీడియాలో ఫోటోలు, విడియోలు దర్శనమిచ్చాయి. ఇద్దరు యువ పోలీసు అధికారుల పనితీరుపై ప్రసంశలు కురిశాయి. రాజన్నసిరిసిల్ల జిల్లాకు ఇద్దరు మంచి యూత్ ఆఫీసర్లు వచ్చారు.. బాగా కష్టపడుతున్నారు అంటూ చర్చించుకున్నారు. వెంకంపేట నుంచి ప్రవహిస్తున్న ప్రమాదకర వరదలో కూడా ట్రాక్టర్పై ఎస్పీ అఖిల్ మహాజన్, డీఎస్పీ ఉదయ్ రెడ్డి ప్రయాణం చేసి ప్రజలను భయందోళకు గురికావద్దని, ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. వరదబాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. పట్టణంలో వరదలో పలువురని కాపాడిన విడియోలు వైరల్ గా మారాయి. శహబాష్ పోలీస్ అని పలువురు సోషల్ మీడియాలో ప్రసంశించారు.  ఎస్పీ అఖిల్ మహాజన్, డీఎస్పీ ఉదయ్రెడ్డి కాంబీనేషన్ అదిరింది అంటూ.. యువ పోలీసు అధికారుల జత కుదిరిందంటూ.. పలువురు కామేంట్లు చేయడం కనిపించింది.