భారి వర్షాలతో  ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - మంత్రి కొప్పుల ఈశ్వర్

భారి వర్షాలతో  ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - మంత్రి కొప్పుల ఈశ్వర్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం ఎప్పటి కప్పుడు సహాయ పునరావాస కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న  వర్షాల వలన జిల్లాలో చేపడుతున్న సహాయ కార్యక్రమాలు, తదితర అంశాలపై జగిత్యాల కలెక్టరేట్ లోని స్టేట్ ఛాంబర్ లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో గత నాలుగైదు రోజుల నుండి వర్షాలు కురుస్తున్నాయనీ, గ్రామీణ, పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అధికార యంత్రాంగం సత్వర సహాయ కార్యక్రమాలు, ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలో 10 పునరావాస కేంద్రాలలో 1100 మందికి  ఏర్పాట్లు చేయడం జరుగుచున్నది తెలిపారు.తెగిపోయిన కల్వర్తులు, దెబ్బతిన్న రోడ్లు వలన రవాణా కు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 1069 చెరువులకు గాను 877 చేరువులలో నీరు పొంగి పోట్లుతున్నయనీ, 9 చెరువులకు దెబ్బతిన్నాయని తెలిపారు. 77 విద్యుత్ పోల్స్, రెండు ట్రాన్స్ఫార్మర్స్ దెబ్బతిన్నాయని తెలిపారు. ఎస్సారేస్పి, కడం ప్రాజెక్టుల నీటి విడుదల ను పరిశీలిస్తూ, జిల్లాలో చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం ఉండాలని ఆయన ఆదేశించారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా  జిల్లాలో కురిసిన వర్షపాతం, నష్టాలు, రిలీఫ్ క్యాంపుల ఏర్పాటు, తదితర అంశాలపై వివరించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, జగిత్యాల ఎమ్మేల్యే సంజయ్ కుమార్, ఎస్పీ భాస్కర్, అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, దివాకర, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.