డిప్యూటీ కలెక్టర్ గా శంకరపట్నం తహశీల్దార్

డిప్యూటీ కలెక్టర్ గా శంకరపట్నం తహశీల్దార్

శంకరపట్నం ముద్ర జులై 28: శంకరపట్నం మండలం తహసీల్దార్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న గూడూరి శ్రీనివాస్ రావు కు పదోన్నతిలో భాగంగా డిప్యూటీ కలెక్టర్గా అవకాశం దక్కింది.ఆయన తహశీల్దార్ గా పలు  మండలాలలో తన సేవలు అందించగా  ప్రస్తుతం శంకరపట్నం మండల తహశీల్దార్  గా సేవలందిస్తున్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో పదోన్నతులలో భాగంగా శ్రీనివాసరావుకు తన సేవలకు ప్రతిఫలంగా డిప్యూటీ కలెక్టర్ గా ఎంపిక కావడంతో మండలంలోని ప్రజాప్రతినిధులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.