అభాగ్యులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ 

అభాగ్యులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ 
  • దివ్యాంగుల ధైర్యం బి ఆర్ ఎస్ ప్రభుత్వం
  • ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ శాసనసభ్యులు  దాస్యం వినయ్ భాస్కర్ 
  • హనుమకొండ కలెక్టరేట్ లో  దివ్యాంగులకు పెంచిన పెన్షన్ పంపిణీ

ముద్ర, తెలంగాణ:-అభాగ్యులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుస్తున్నారని, దివ్యాంగుల ధైర్యం బి ఆర్ ఎస్ ప్రభుత్వం అని ప్రభుత్వ చీఫ్ విప్ పశ్చిమ శాసనసభ్యులు  దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లో  దివ్యాంగులకు పెంచిన పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మనసున్న ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని, దివ్యాంగుల సాధకబాధకాలు తెలిసే వారి పింఛన్ పెంచారని అన్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో దివ్యాంగులు ఎన్నో కష్టాలు అనుభవించే వారిని, కనీసం పింఛన్ కు సైతం నోచుకోలేదని అన్నారు.

నాడు 500 రూపాయల పింఛన్ ఇస్తే,  నేడు 4016 ఇస్తున్నారని తెలిపారు. నాడు దివ్యాంగులు ఆత్మనూన్యత తో బతికితే నేడు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల్లో  సైతం దివ్యాంగులకు ప్రత్యేక కోటాను తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్నదని అన్నారు. దివ్యాంగులకు అవసరమైన రుణాలను, ఉపకరణాలను అందిస్తోందని చెప్పారు. ప్రత్యేకంగా హాస్టల్ లను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్  విప్  దివ్యాంగులతో కలిసి భోజనం చేశారు. దివ్యాంగులకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.