చెరువులో చేపలు పడుతూ మత్స్యకారుడి మృతి

చెరువులో చేపలు పడుతూ మత్స్యకారుడి మృతి

ముద్ర,ఎల్లారెడ్డిపేట:  చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన మత్స్యకారుడు  మృతి చెందిన సంఘటన ఎల్లారెడ్డిపేట మండలంలో చోటుచేసుకుంది కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండలం  సింగారం గ్రామానికి చెందిన  బొమ్మిడి నారాయణ 65  ఆదివారం సాయంత్రం చేపల వేటకు బండ లింగంపల్లి చెరువుకు వెళ్లి చేపలు పడుతూ ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు నారాయణ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఎంత వెతికినా తన జాడ దొరకలేదు ఆదివారం అర్ధరాత్రి 11 సమయంలో చెరువులో మృతదేహం పైకి తేలాడుతూ కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతునికి భార్య లస్మవ్వ, కూతుర్లు బాలసుధ,సంధ్య లు ఉన్నారు. ఎల్లారెడ్డిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని మండల మత్స్యకారులు కోరుచున్నారు.