కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ

కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ

ముద్ర,ఎల్లారెడ్డిపేట :కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ కు గురువారం నియామక పత్రాన్ని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పంపిన నియామక పత్రాన్ని అందజేశామన్నారు. అల్మాస్పూర్ గ్రామానికి చెందిన పసుల కృష్ణ ప్రస్తుతం అడ్వకేట్ గా పనిచేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి తాను పార్టీలో చేరానని తన నియామకానికి సహకరించిన సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని గ్రామాలలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని కృష్ణ అన్నారు. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి కృష్ణ ను సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, కిసాన్ సెల్ జిల్లాఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాసరెడ్డి, నాయకులు కొత్తపల్లి దేవయ్య,సూడిద రాజేందర్, మానుక నాగరాజు,గుండ్ల శ్రీనివాస్ ,చెట్పల్లి బాలయ్య ,ఎండి ఇమామ్ ,మేడిపల్లి రవీందర్, సంతోష్ గౌడ్, ఎండి రఫీక్ ,కోనేటి పోచయ్య ,తిరుపతి గౌడ్,  సిరిపురం నరేందర్,  మామిండ్ల కిషన్ ,లక్ష్మీనరసయ్య తదితరులు పాల్గొన్నారు.