సిరిసిల్ల సెస్ లో 9 మంది ఉద్యోగుల సస్పెన్షన్

సిరిసిల్ల సెస్ లో 9 మంది ఉద్యోగుల సస్పెన్షన్
  • మాజీ సెస్ డైరక్టర్ కోళ్ల ఫాంకు అక్రమంగా విద్యుత్ ఇచ్చారంటూ ఆరోపణలు
  • డీటీఆర్ ఆమౌంట్ రీకవరికి ఆదేశాలు..
  • సిరిసిల్ల సెస్ లో సంచలనం..
  • బీజేపి నేత అల్లాడి రమేశ్ పై కోపంతోనే సెస్ ఉద్యోగులపై చర్యలంటూ ప్రచారం

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల:రాజన్నసిరిసిల్ల జిల్లా లో పేరుగాంచిన సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) లో 9 సెస్ ఉద్యుగులను సస్పెన్షన్ చేస్తూ సెస్ ఎండి రామకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. బీజేపి నాయకులు సెస్ మాజీ డైరక్టర్ అల్లాడి రమేశ్కు సంబంధించిన కోళ్ల ఫాంకు అక్రమంగా సింగిల్ ఫేజ్ డీటీఆర్ ఇవ్వడమే కాకుండా దానికి ముందస్తు మీటర్లు ఇచ్చారనే ఆరోపణలతో 9 మంది ఉద్యోగులపై వేటు వేశారు. ఏఈ శ్రవంతి, లైన్ ఇన్స్పెక్టర్ బ్రహ్మయ్య, లైన్ మెన్లు రాజశేఖర్, రవీందర్ అసిస్టెంట్ లైన్ మెన్ దేవయ్య, అసిస్టెంట్ హెల్పర్లు తిరుపతి,గుంటి రమేశ్, యెన్నం రాజు, మిట్టపల్లి కార్తీక్లను సస్పెండ్ చేశారు. వీరి నుంచి సంస్థకు రావాల్సిన సొమ్మును రీకవరి పెట్టారు. ఇందులో కొంత మంద డబ్బులను సెస్ సంస్థకు జమ చేసినట్లు తెలిసింది. అగస్టు 19 నే ఈ సస్పెన్షన్ అర్డర్ రాగా ఇప్పటి వరకు బయటకు తెలవలేదు. ఒక్కసారిగా సిరిసిల్ల సెస్ నూతన పాలకవర్గం వచ్చాక 9 మంది ఉద్యోగులపై వేటు రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా చర్చనీయంశమైంది. గతంలో హెచ్వీడీఎస్ కాంట్రాక్టర్ గా వ్యహరించిన సెస్ మాజీ డైరక్టర్ అల్లాడి రమేశ్ వ్యవహరించినట్లు సమాచారం. సెస్ లో ముందస్తు విద్యుత్ కనెక్షన్లు సర్వసాధరణమే అని.. తర్వాత కాస్తా లేటుగా కూడా సెస్ సంస్థలో డబ్బులు జమ చేస్తారని పలువురు పేర్కొంటున్నారు. కానీ బీజేపి నేత అల్లాడి రమేశ్పై ఉన్న రాజకీయ కోణంలో సెస్ ఉద్యోగులపై చర్యలకు దిగినట్లు తెలిసింది. ఏది ఏమైన సిరిసిల్ల సెస్ ఉద్యోగుల సస్పెన్షన్ ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా లో హాట్టాఫీక్గా మారింది.ఇదిలా ఉండగా ఉద్యోగుల నుంచి డబ్బులు రీవకరి చేశాక ఎలా సస్పెండ్ చేస్తారని పలువురు సెస్ ఉద్యోగులు వాపోతున్నారు.