గిరిజన మహిళకు న్యాయం చేయండి

గిరిజన మహిళకు న్యాయం చేయండి
  • ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా
  • పోలీసులను సస్పెండ్ చేయాలి
  • తాసిల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నా

ముద్ర, ఎల్లారెడ్డిపేట : గిరిజన మహిళకు న్యాయం చేయాలని ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు బుధవారం ధర్నా చేశారు. అనంతరం రెవెన్యూ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ హైదరాబాదులోని ఎల్బీనగర్ లో గిరిజన మహిళ లక్ష్మీబాయిపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామన్నారు. తన ఇంటిలో జరిగే వివాహం కోసం మూడు లక్షలు పెండ్లి పత్రిక తీసుకొని వెళుతుండగా పోలీసులు అడ్డుకొని అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో ఆమెను చిత్రహింసల గురి చేయడం అన్యాయం అన్నారు. పైగా ఆ మహిళను తన స్వగ్రామంలోని ఇంటి వద్ద దించి వేసి రావడం అన్యాయం అన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో మహిళలను, పిల్లలను, వృద్ధులను పోలీసులు చితక బాదడం ఆనవాయితీగా మారిందన్నారు, హైకోర్టు స్పందించి తక్షణమే ఆమెను కొట్టిన పోలీసుల పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డిజిపిని ఆదేశించిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు, ప్రభుత్వం పూర్తిగా దౌర్జన్యానికి మద్దతు పలుకుతుందని అన్నారు,గిరిజన మహిళకు నష్టపరిహారం కింద 50 లక్షలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి,నాయకులు రోడ్డ రామచంద్రం, భానోత్ రాజు నాయక్, చెన్ని బాబు, గంటబుచ్చా గౌడ్, సిరిపురం మహేందర్, దొమ్మాటి రాజు, దండు శ్రీనివాస్, కంచర్ల రాజు, చెట్పల్లి బాలయ్య, తిరుపతిరెడ్డి ,మామిండ్ల కిషన్, తిరుపతి గౌడ్, లక్ష్మీనరసయ్య,ఎండి రఫీక్ ,రమేష్, పరశురాములు ,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.