చిగురుమామిడిలో ఘనంగా ప్రపంచ రంగస్థల దినోత్సవ వేడుకలు

చిగురుమామిడిలో ఘనంగా ప్రపంచ రంగస్థల దినోత్సవ వేడుకలు

చిగురుమామిడి ముద్ర న్యూస్: తెలంగాణ రంగస్థల సాంస్కృతిక కళాకారుల అసోసియేషన్ చిగురుమామిడి మండల కమిటీ అధ్యక్షుడు శ్రీరామోజు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రపంచ రంగస్థల దినోత్సవ వేడుకలు మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ... ఏది ఆశించకుండా సమాజ సేవ చేసే కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తూ 50 సంవత్సరాలు దాటిన కళాకారులకు 5 వేల రూపాయల పింఛను ఇవ్వాలని, మండల కేంద్రంలో కమ్యూనిటీ హాలు,కళాకారులకు సంబంధించిన మేకపు, సౌండ్ సిస్టం, వాయిద్య పరికరాలు ప్రభుత్వం అందించాలని విజ్ఞప్తి చేశారు.

తద్వారా కళాకారులు ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ మన సంస్కృతి సంప్రదాయాలను, మానవతా విలువలను అందరికీ తమదైన శైలిలో ప్రదర్శిస్తూ మంచి సమాజ నిర్మాణానికి తోడ్పడతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి చందబోయిన పరశురాములు, మండల ప్రధాన కార్యదర్శి రాధారపు సంపత్, ఉపాధ్యక్షుడు ముసాపూరి సంపత్, కోశాధికారి బింగి లక్ష్మీనారాయణ, కార్యవర్గ సభ్యులు కుతాడి కొమురయ్య, మల్లం బాలయ్య, గందె రాములు, మొగిలి బొందయ్య, మోర వెంకటమల్లు, నిలిగొండ కిషన్, కమిటీ ముఖ్యులు కల్వల చంద్రారెడ్డి, చొప్పదండి సుధాకర్, జవాజి రాములు, పత్తెం రమేష్, కాటం సంపత్ రెడ్డి, దుడ్డేల రవి, విశ్వనాథం సత్యనారాయణ, గోపగోని వెంకటేష్ ,చందబోయిన మల్లయ్య, చంద్రయ్య, మినుగుల వెంకటి, వర్ణ కుమార్ రెడ్డి, కోరండ్ల వెంకటరెడ్డి, గోపగోని దిలీప్, పోలోజు కుమారస్వామి, అనువోజు వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు.