నిర్లక్ష్యపు ఆరబోత

నిర్లక్ష్యపు ఆరబోత

రైతులు ధాన్యం కుప్పలు రోడ్ల పై ఆరబోపోయ వద్దు.ఎస్ ఐ శ్రీకాంత్ రెడ్డి

ముద్ర న్యూస్ రేగొండ:రోడ్ల పై రైతులు ధాన్యం కుప్పలు ఆర బోస్తుండటం ప్రమాదాలకు దారి తీస్తుందని రేగొండ మండల ఎస్ ఐ ననిగంటి శ్రీకాంత్ రెడ్డి, అన్నారు. ఈ సందర్భంగా ఎస్ ఐ శ్రీకాంత్ రెడ్డి, మాట్లాడుతూ. రేగొండ మండల పరిధిలో రోడ్లపై రైతులు ధాన్యం కుప్పలు ఆర బోస్తుండటంతో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని రోడ్లపై ధాన్యం కుప్పలు ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతున్నాయని అన్నారు. రైతులు తాము పండించిన ధాన్యం రహదారిపై ఒక వైపు ఆరబోయడం వల్ల, ఆ దారిలో ఒకేవైపు ఎదురెదురుగా ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, రాత్రి పూట ఆ దారి వెంట అజాగ్రత్తగా ప్రయాణిస్తే ప్రమాదాలు తప్పవని. వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అని తెలిపారు.

రైతులు ఇష్టానుసారంగా రోడ్ల పై ధాన్యం కుప్పలు రోజుల తరబడి ఆరబోస్తుండటంతో ప్రమాదాలకు మరింత ఊతమిస్తోందని, రోజంతా ఆరబోసిన ధాన్యం సాయంత్రం కాగానే ఎక్కడిక్కడే కుప్పలుగా చేసి మరుసటి రోజు ఉదయాన్నే మళ్లీ ఆరోబోస్తున్నారని రాత్రంతా ధాన్యం కుప్పలు అక్కడే ఉంచడంతో చీకట్లో కుప్పలు కనిపించక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని, ధాన్యం కుప్పల కారణంగా ప్రమాదాలు జరిగితే సంబందిత రైతులపై కేసులు నమోదు చేస్తామని సూచించారు. రోడ్డు ప్రమాదాలకు ప్రాణాలు పోతుంటే ఆ నష్టం పూడ్చలేనిదని రైతులు గుర్తించాలని, కావున రైతులు ఆలోచించి ధాన్యం కుప్పలను రహదారులపై పోయకుండా ధాన్యం ఆరబెట్టేందుకు కల్లాలను ఉపయోగించుకోవాలని ఎస్ ఐ శ్రీకాంత్ రెడ్డి, రైతులకు సూచించారు.