ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా దిల్​రాజు

ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా దిల్​రాజు
  • వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎం.రామదాసు, కార్యదర్శిగా దామోదర్‌ ప్రసాద్‌, 
  • ట్రెజరర్‌గా ప్రసన్నకుమార్‌ విజయం

ముద్ర, హైదరాబాద్​: తెలుగు ఫిలిం ఛాంబర్​అధ్యక్షుడిగా దిల్​రాజు ఎన్నికయ్యారు. మొత్తం 48 ఓట్లలో రాజు 31 ఓట్లు కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో ఛాంబర్​లోని కీలక పోస్టులను దిల్​రాజు ప్యానెల్​కైవసం చేసుకుంది. ప్రొడ్యూసర్‌ సెక్టార్‌లో 1,600 ఓట్లకుగాను 891, స్టూడియో సెక్టార్‌లో 98 ఓట్లకుగాను 68, డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ లో 597 గాను 380 ఓట్లు పోలయ్యాయి. ప్రెసిడెంట్‌గా దిల్‌రాజు, వైస్‌ ప్రెసిడెంట్‌గా ముత్యాల రామదాసు, కార్యదర్శిగా దామోదర్‌ ప్రసాద్‌, ట్రెజరర్‌గా ప్రసన్నకుమార్‌ ఎన్నికయ్యారు. ప్రొడ్యూసర్‌ సెక్టార్‌లోని మొత్తం 12 స్థానాల్లో ఏడింటిని దిల్‌రాజు ప్యానల్‌ కైవసం చేసుకుంది. డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌లో 2 ప్యానల్స్‌ నుంచి సి.కల్యాణ్, దిల్ రాజు సెంటర్ల నుంచి చెరో ఆరుగురు గెలుపొందారు.