కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్
  • పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో

ముద్ర,ఎల్లారెడ్డిపేట:మజీ ఎంపీటీసీ, టిఆర్ఎస్ ఉద్యమకారుడు, మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ భర్త ఒగ్గు బాలరాజు యాదవ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఒగ్గు బాలరాజు యాదవ్ ఆదివారం హైదరాబాదులో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా ఉద్యమకారునిగా కొనసాగిన ఒగ్గు బాలరాజు యాదవ్ కు అప్పటి జడ్పిటిసి తోట ఆగయ్య ఎంపీటీసీగా అవకాశం ఇవ్వగా గెలుపొంది ఐదు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగి అనంతరం తన భార్య, తల్లిని వార్డు సభ్యులుగా గెలిపించుకున్నాడు. అదేవిధంగా ఇప్పుడున్న పాలకవర్గంలో ఉప సర్పంచ్ గా తన భార్య ఒగ్గు రజిత కొనసాగుతుంది. గత మూడేళ్లుగా టిఆర్ఎస్ పార్టీకి దూరం ఉంటూ పక్షం రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా లేఖను సమర్పించారు. ఎల్లారెడ్డిపేటలో యాదవ కమ్యూనిటీలో కీలక పాత్ర పోషిస్తున్న ఒగ్గు బాలరాజు యాదవ్ ను అనూహ్య పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించగా వారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిసింది. రానున్న శాసనసభ ఎన్నికలలో తన వంతు పాత్ర పోషించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తానని ఒగ్గు బాలరాజు యాదవ్ పేర్కొన్నారు.