కేంద్ర జలశక్తి అభియాన్ అధికారుల సందర్శన

కేంద్ర జలశక్తి అభియాన్ అధికారుల సందర్శన

పనుల తీరుపట్ల  సంతృప్తి వ్యక్తం చేసిన జలశక్తి అభియాన్  అధికారులు

ముద్ర, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లోని హరిదాస్ నగర్, సింగారం, రాజన్నపేట, అల్మాస్పూర్ గ్రామాలలో  శనివారం కేంద్ర జల శక్తి అభియాన్ అధికారులు సందర్శించారు. ఎల్లారెడ్డిపేట మండల కార్యాలయం లోని కాంప్లెక్స్ లో నీటి నిర్వహణకు సంబంధించిన పనులను, ఇంకుడు గుంత గురించి ఎంపీడీవో చిరంజీవిని అడిగి తెలుసుకున్నారు.  అనంతరం హరిదాస్ నగర్ లోని ఫారం పండ్, సింగారంలోని మైసమ్మ చెరువు, చెక్ డ్యామ్, మంకీ ఫుడ్ కోర్టు పనులు, రాజన్నపేటలోని వడ్లవానికుంటలో పూడుకతీత పనులను పరిశీలించారు.

అల్మాస్ పూర్ లోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వర్క్ ( చెక్ డ్యామ్ ) పనులను సందర్శించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీటి వినియోగం గురించి, నీటి నిల్వలను వాటి యొక్క ఉపయోగకరముల వివరాలను అడిగారు. పనులు బాగా జరుగుతున్నాయని కితాబ్ ఇచ్చారు. ఈ సందర్శన కార్యక్రమంలో కేంద్ర జల శక్తి అభియాన్  అధికారులు  గణేష్ కుమార్ బరర్వాల్ డిప్యూటీ సెక్రటరీ, నారాయణ దామోదర్ సైన్సిస్ట్ విశాఖపట్నం తోపాటు  ఎల్లారెడ్డిపేట మండల ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, సీఈఓ జెడ్పి  గౌతమ్ రెడ్డి, అడిషనల్ డి ఆర్ డి వో మదన్ మోహన్, ఎంపీడీవో చిరంజీవి, ఎపీ ఓ కొమురయ్య , ఆయా సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.