పెద్దపల్లిలో మిన్నంటిన సంబరాలు

పెద్దపల్లిలో మిన్నంటిన సంబరాలు

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: భారత రాష్ట్ర సమితి ఎన్నికల మేనిఫెస్టో ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సంబరాలు ఆదివారం చేసుకున్నారు. గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జనరంజక మేనిఫెస్టోను ప్రవేశపెట్టారన్నారు. మరో సారి నిరుపేదల, రైతుల, మహిళా పక్షపాతిగా కెసిఆర్ నిలిచారన్నారు. రైతుబంధు ఎకరానికి 16 వేలకు పెంపు, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షలకు పెంచడం, తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్నబియ్యం పంపిణీ, రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు రూ. 5 లక్షల రూపాయల బీమా, ఆసరా పింఛన్లను ఐదు వేలకు పెంచడం, వికలాంగుల పింఛను 6 వేలకు పెంచడం, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడం అతి గొప్ప విషయాలు అన్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచినవి కేవలం 10 శాతం మాత్రమేనని, ప్రజల అవసరం మేరకు పథకాలను రూపొందించడంలో ప్రపంచంలోనే కేసీఆర్ కన్నా మించిన వారు లేరన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా దాసరి మనోహర్ రెడ్డిని మూడోసారి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రాజ్ కుమార్, జంబు భాయ్, ఖదీర్, జావీద్, పెంచాల శ్రీధర్, బిక్షపతి, చంద్రశేఖర్, చంద్రమౌళి, ఫహీం, కనకరాజు, శ్రీధర్ రఫీ, వెన్నం రవీందర్ తోపాటు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.