మంథని టూ గోపాలపుర్ కు ప్రయాణం గోస గోస అరిగోస

మంథని టూ గోపాలపుర్ కు ప్రయాణం గోస గోస అరిగోస
  • గుంతల మయమైన ప్రధాన రహదారి
  • ఎగ్లాస్పూర్ నుంచి రచ్చపల్లి వరకు గుంతకో ఇసుక లారీ
  •  నీళ్లు పోయక దుమ్ము లేచి ప్రయాణం నరకయాతన పట్టించుకోని మైనింగ్  ఇసుక కాంట్రాక్టర్

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి:  ప్రధాన రహదారులన్నీ ఇసుక లారీలు నడిచి గుంతల మయం కావడంతో గుంతకో ఇసుకరారీ నడుస్తుండడంతో రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రయాణికులు ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. పెద్దపెల్లి జిల్లా మంథని పట్టణం నుండి ఎగ్లాస్పూర్, రచ్చపల్లి మీదుగా , ఓదాల,  గోపాలపుర్ గ్రామాలకు పోవాలంటే  ఆ గ్రామాల ప్రజలు, ప్రయణికులు అరిగోస పడుతున్నారు. ప్రభుత్వం గోపాలపుర్, ఓదాల మానేరు పై రెండు ఇసుక క్వారీలు ఏర్పాటు చేయటంతో రోజు దాదాపు 100 నుండి 200 వరకు ఇసుక లారీలు ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్నాయి. దీంతో రోడ్డు గుంతల మాయమై,  దుమ్ము లేచి ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రయాణికులకు, ఆటోలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, మైనింగ్ అధికారులు కానీ ఇసుక కాంట్రాక్టర్లు గాని ఈ రోడ్డుపై ట్యాంకర్ తో నీళ్లు కొట్టకపోవడంతో దుమ్ము లేచి ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారింది.  మైనింగ్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.  గోపాలపూర్, ఓదాల గ్రామాలకు మంథని పట్టణం నుంచి పోవాలంటే ప్రాణాలు అరి చేతుల్లో పెట్టుకొని ప్రయాణించాల్సిందే, అని ప్రజలు అవేదన వ్యక్తం చేస్తూ చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ప్రజలకు ఇబ్బందులు లేకుండ రహదారికి మరమ్మతులు చేసి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.