సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలి…

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలి…

ముద్ర,  గంభీరావుపేట:సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని, తల్లిదండ్రులను సైతం అప్రమత్తం చేయాలని షీ టీం ఎస్ఐ అంజయ్య అన్నారు.  మంగళవారం  గంభీరావుపేట మండలం దమ్మన్నపేట మోడల్ స్కూల్ లో పోలీస్ శాఖ ఆద్వర్యంలో విద్యార్ధులకు మహిళల భద్రత మరియు  సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షీ టీం ఎస్ఐ అంజయ్య  మాట్లాడుతూ… అపరిచితలు ఎవరైనా పోన్ చేసి తమ ఆధార్ నెంబర్, బ్యాంకు అకౌంటు నెంబర్, ఓటిప్ నెంబర్లు చెప్పమని కోరితే అటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండా లన్నారు. పోన్లో ఎటువంటి నెంబర్లు, ఓటిపిలు ఇతర వ్యక్తులకు చెప్పవద్దన్నారు. మన వ్యక్తిగత వివరాలు, ఫోటోలు ఇతర వ్యక్తులకు పంపకూడదన్నారు.అలాగే ఆడపిల్లల  పనిచేస్తున్న, ఇతర చోట్ల వేధింపులు, ఈవ్‌ టీజింగ్‌, ఫొటో మార్ఫింగ్‌, బ్లాక్‌మెయిలింగ్‌ లాంటి నేరాలు జరుగుతున్నాయని, అలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు వెంటనే డయల్‌ 100కు ఫొన్‌ చేయాలని, షీటీమ్స్‌కు సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రమేష్, ఉపాధ్యాయులు, షీ టీం సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.