వేములవాడ లో పొలిటికల్ హీట్..

వేములవాడ లో పొలిటికల్ హీట్..

చెన్నమనేని వర్సెస్ చలిమెడ
చెన్నమనేని ఇలాకాలో.. చెలిమెడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఓపెన్
మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటనకు ఒక్కరోజు ముందే వేములవాడలో ఆఫీస్ ఓపెన్
చలిమెడ పార్టీ కార్యాలయం ఓపెన్కు 500 మందికి పైగా బీఆర్ఎస్ శ్రేణుల హజరు
రాజన్నసిరిసిల్ల జిల్లాలో తీవ్ర స్థాయిలో రాజకీయ చర్చ
వేములవాడ ఎమ్మెల్యే స్థానం కోసం చలిమెడ లక్ష్మీనరసింహారావ్ ప్రయత్నాలు
బీఆర్ఎస్ అధిష్టానం పరోక్షంగా గ్రీన్ సిగ్రల్ ఇస్తేనే వేములవాడలో వేములవాడలో ఆఫీస్ ఓపెన్ అంటు చర్చ
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు వ్యతిరేఖులంతా లక్ష్మీనరసింహరావ్ వైపు జంప్
వేములవాడ లో రాజకీయ పట్టు సాధించేందుకు చలిమెడ లక్ష్మీనరసింహారావు ప్రయత్నాలు
అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీలో ఉంటా.. నాకు ఎన్నికలు కొత్తేమి కాదంటూ ప్రకటన

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ లో ఎమ్మెల్యే ఎన్నికలకు ఏడాది ముందే పోలిటికల్ హాట్ పెరిగింది. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న.. ఆర్థికంగా, సామాజికంగా మంచి పట్టున్న వ్యక్తి, చలిమెడల వైద్య సంస్థల చైర్మన్ లక్ష్మీనరసింహరావ్ వేములవాడ లో బీఆర్ఎస్ పార్టీ సోంతంగా కార్యాలయం ఏర్పాటు ప్రారంభించి సంచలనం సృష్టించారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో లక్ష్మీనరసింహారావ్ బారి ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కూడగట్టి ప్రారంభించించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీశాడు. గత కొన్ని రోజులుగా వేములవాడ ఎమ్మెల్యే టికెట్ బీఆర్ఎస్ నుంచి లక్ష్మీనరసింహారావుకే అంటూ ప్రచారం సాగడం.. లక్ష్మీనరసింహారావు వేములవాడ లో ఏర్పాటు చేసిన ప్లెక్సీల తొలగింపు నుంచి మొదలైన ముసలం.. ఒకరిపై ఒకరు ప్రత్యేక్ష రాజకీయ విమర్శలు చేసుకునే పరిస్థితి నెలకొంది. మంగళవారం వేములవాడ పట్టణంలో లక్ష్మీనరసింహారావు కార్యాలయం ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో తాను అవకాశం వస్తే వేములవాడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, బీఆర్ఎస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న దానికి సిద్దంగా ఉంటానని , పార్టీకి విదేయునిగా పని చేస్తానంటూ చలిమెడ లక్ష్మీనరసింహారావ్ ప్రకటించారు.

ఇన్నాళ్లు ఉన్న సస్పెన్స్కు లక్ష్మీనరసింహారావ్ తెరదింపినట్లు అయ్యింది.దీంతో బీఆర్ఎస్ లో రెండు గ్రూపులుగా వీడిపోయి.. ఎమ్మెల్యేను వ్యతిరేఖిస్తున్న వారంత లక్ష్మీనరసింహారావుతో జతకట్టారు. తమకు మనుషులుగా కూడా గుర్తించడని, బీఆర్ఎస్ క్యాడర్ చాలా మంది ఇబ్బంది పడుతున్నట్లు.. సీనియర్లకు గౌరవం ఇవ్వకుండా రమేశ్ బాబు వేదింపులకు గురి చేస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు కొంత బహిరంగగానే మంగళవారం పేర్కొన్నారు. ఐన బీఆర్ఎస్ పార్టీ లో తాము ఉన్నాం కాబట్టి పార్టీ చెప్పినట్లే పని చేస్తామని.. పేర్కొంటునే లక్ష్మీనరసింహారావుకు బహిరంగ మద్దతు ప్రకటించడం రాజకీయ చర్చకు దారి తీస్తుంది.

మంత్రి కేటీఆర్ కు ఒక్క పర్యటన ముందే 
రాజన్నసిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పర్యటనకు ఒక్కరోజు ముందే వేములవాడ లో రమేశ్ బాబుకు వ్యతిరేఖంగా రాజకీయ కార్యకాలపాలు నిర్వహిస్తూ.. టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్ చలిమెడ లక్ష్మీనరసింహారావు వ్యక్తిగతంగా ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంను ప్రారంభించారు. వేములవాడ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకే ఈ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే పరోక్షంగా చెన్నమనేని రమేశ్బాబు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, ఈ ఆసారి టికెట్ కూడా కష్టమేనని చెప్పకనే చెప్పినట్లు.. బీఆర్ఎస్ క్యాడర్కు, ప్రజలకు బలమైన మేసేజ్ను పంపినట్లు అయ్యింది.మండలాల వారిగా లక్ష్మీనరసింహారావ్ పర్యటనలు, ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకోని పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు.

మంత్రి కేటీఆర్ రాజన్నసిరిసిల్ల జిల్లాకు కానీ ఇతర జిల్లాలకు కానీ వచ్చినప్పుడల్ల చలిమెడ లక్ష్మీనరసింహారావ్ క్లోజ్గా ఉండటం.. అందరి కంట పడుతుంది. కేటీఆర్ పర్యటనకు ఒక్కరోజు ముందే వేములవాడ కార్యాలయం ప్రారంభోత్సవం కూడా పరోక్షంగా బీఆర్ఎస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తన పని తాను చేసుకొండని ఆదేశాలు ఇచ్చారా... లేక.. చెన్నమనేని వ్యతిరేఖ వర్గం లక్ష్మీనరసింహారావుపై ఒత్తిడి పెంచి ఈ కార్యాలయం ఓపెన్ చేయించారా తెలియాల్సి ఉంది. ఏది ఏమైన చెన్నమనేని రమేశ్ బాబు రాజకీయ భవితత్వం కాస్తా ఇరకాటంలో పడ్టట్లేనని.. ఈ మధ్య ఎమ్మెల్యే రమేశ్ బాబు పలు సందర్బాల్లో బీఆర్ఎస్ అధిష్టానాన్ని, కేటీఆర్ ను విమర్శించిన విడియోలు సోషల్ మీడియాలో ప్రత్యేక్షం కావడం.. తో మంత్రి కేటీఆర్కు వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబుకు రాజకీయ అంతరం పెరుగుతుందని, ఈ నేపధ్యంలోనే ఆర్థికంగా, రాజకీయంగా మంచి పేరున్న చలిమెడ లక్ష్మీనరసింహారావును వేములవాడ తెరపైకి తీసుకువచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.