మన ఊరు మనబడిపనులను త్వరగా పూర్తి చేయాలి -జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి 

మన ఊరు మనబడిపనులను త్వరగా పూర్తి చేయాలి  -జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి 

అన్ని ప్రభుత్వ పాఠశాలల త్రాగునీటి ట్యాంకులకు మిషన్ భగీరథ కనెక్షన్ ఇవ్వాలి


ముద్ర కోనరావుపేట :  ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడత చేపట్టిన పనులను తొందరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు బుధవారం  మండలంలోని ధర్మారం, సుద్దాల గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లోపర్యటించి మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేపట్టిన పనులు ఆశించిన వేగంగా జరగకపోవడం పై జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతం లోగా మొదటి విడతలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద బడుల్లో చేపట్టిన  విద్యుత్ తాగునీటి వసతి, ఇతర రిపేర్ల ను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ఎన్ఆర్ఈజీఎస్  కింద చేసే పనుల్లో మరుగుదొడ్లు, వంట గదులు ప్రహారీ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ధర్మారం ZPHS లో ప్రస్తుతం ఉన్న బాలుర టాయిలెట్ బ్లాక్ కు రిపేర్ లు చేపట్టి వినియోగంలోకి తేవాలన్నారు మొదటి విడత లో పనులను పూర్తి కాబడిన పాఠశాలల కు పేయింటింగ్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. 


సుద్దాల గ్రామంలో మిషన్ భగీరథ త్రాగునీరు స్కూల్ లతో పాటు ఇండ్లకు రావడం లేదని స్థానికులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. చిన్నపాటి మరమ్మత్తులు చేపడితే స్కూల్ లతో పాటు ఇండ్లకు మిషన్ భగీరథ త్రాగునీరు అందుతుందని అన్నారు. స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టి త్రాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని మిషన్ భగీరథ అధికారులను  కలెక్టర్ ఆదేశించారు.అలాగే మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఈ నెలాఖరులోగా మిషన్ భగీరథ కింద కనెక్షన్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సంబంధిత ఇంజనీరు లను ఆదేశించారు.

 కంటి వెలుగును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి 

పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ కొనరావుపేట మండలం కనగర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఇప్పటివరకు ఈ గ్రామంలో 724 మందికి పరీక్షలు నిర్వహించామని వైద్యాధికారులు జిల్లా కలెక్టర్ కు తెలిపారు. 9 రోజులపాటు కనగర్తి గ్రామంలో క్యాంపు నిర్వహిస్తామని తెలిపారు.
గ్రామంలోని ప్రతి ఒక్కరిని మొబిలైజేషన్ చేసి ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేసుకునేలా చూడాల్సిన బాధ్యత వైద్యాధికారులతోపాటు గ్రామపంచాయతీ సిబ్బందిదేని తెలిపారు.


అనుమతి ఉన్న ప్రతి చోట ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలి
 కనగర్తి గ్రామంలో  కలెక్టర్ గ్రామ పంచాయతీ లో ఎన్ని కమ్యూనిటీ ఇంకుడు గుంతలు నిర్మించారని ఎంపిడివో ను కలెక్టర్ ప్రశ్నించగా ఒక్కటి మాత్రమే నిర్మించామని సమాధానం ఇచ్చారు  నాలుగు నిర్మించాల్సి ఉండగా ఒక్కటే మాత్రమే నిర్మించారని మిగిలిన ఇంకుడు గుంతలను గ్రామ పంచాయితీ అంగీకారం తెలిపిన అన్ని చోట్ల కమ్యూనిటీ ఇంకుడు గుంతలు నిర్మించాలని ఆదేశించారు.
కన్సేంట్ లేకపోతే మినీ కిచెన్ గార్డెన్ కానీ , నీటిని అధికంగా తీసుకునే మొక్కలను నాటాలని చెప్పారు. ఇంకుడు గుంతల వల్ల గ్రామంలో పారిశుద్ధ్యం పెంపొందించడంతో పాటు భూగర్భ జలమట్టం పెరుగుతుందని, ప్రజలు కీటక జనిత వ్యాధుల బారిన పడకుండా ఉంటారనిఅన్నారు మండలం కు 56 కమ్యూనిటీ ఇంకుడు గుంతలు మంజూరు కాగా ఇప్పటివరకు 27 మాత్రమే పూర్తి చేశారని మిగతా కమ్యూనిటీ గుంతలను త్వరలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మండల ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఎదురుగట్ల చంద్రయ్య , జిల్లా విద్యాధికారి రమేష్ , జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, జిల్లా ఉప వైద్యాధికారి శ్రీరాములు ,ఎంపీడీవో రామకృష్ణ సర్పంచ్ లు గున్నాల అరుణ  అనుపాటి భారతి ఉప్పుల దేవాలక్ష్మి ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు ఉన్నారు.