తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో  విద్యుత్ శక్తి రంగంలో విప్లవాత్మక మార్పులు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో  విద్యుత్ శక్తి రంగంలో విప్లవాత్మక మార్పులు
  • వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో 'సెస్' పాత్ర అమోఘం
  • వేములవాడ అర్బన్ మండల సెస్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే రమేష్ బాబు వ్యాఖ్యలు

ముద్ర, వేములవాడ :-తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత విద్యుత్ శక్తి రంగంలో విప్లవాత్మక మార్పులు  వచ్చాయని స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు స్పష్టం చేశారు. వేములవాడ అర్బన్ మండలం మారుపాక సమీపంలో ఏర్పాటు చేసిన అర్బన్ మండల(టౌన్-2)  సెస్ కార్యాలయాన్ని  చైర్మన్ చిక్కాల రామరావు, డైరెక్టర్ రేగులపాటి హరిచరణ్ రావులతో కలిసి ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రారంభించాడు.  ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ 52 ఏండ్ల ఘన చరిత్ర కలిగిన సెస్ సహకార సంస్థలో  మరో 50 ఏండ్లకు అవసరమైన నూతన సంస్కరణలు చేయాల్సిన అవసరం,  సవాళ్లు ముందున్నాయని, వాటన్నింటినీ  అధిగమించే విధంగా మంత్రి కేటీఆర్  గొప్పగా సహకారం అందిస్తున్నారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పటైన తర్వాత విద్యుత్ శక్తి రంగంలో విప్లవాత్మక మైన మార్పులు తీసుకొచ్చి 9 ఏండ్ల లోనే ఇతర రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేసేంత స్థాయికి  ఎదగడం సీఎం కేసీఆర్ కార్యదక్షతకు నిదర్శనమని అన్నారు. రైతులకు నిరంతరం ఉచితమైన, నాణ్యమైన విద్యుత్ అందిస్తూ  చుక్క వర్షం పడకున్న రివర్స్ పంపింగ్ తో  మిడ్ మానేరులోకి  25 టి.ఎం.సిల నీళ్లను పంపించడం చూస్తేనే తెలంగాణ వస్తే ఎం వచ్చిందో అర్థమవుతుందని స్పష్టం చేశారు. రాబోయే రో జుల్లోనూ సెస్ పాలకవర్గం వినియోగదారులకు  మరింత మెరుగైన సేవలు అందిస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెస్ ఛైర్మన్ చిక్కాల రామారావు, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, సెస్ ఎం.డి రామకృష్ణ, ఎంపీపీ బూర వజ్రమ్మ-బాబు, జడ్పీటీసీ మ్యాకల రవి, వైస్ ఎంపిపి ఆర్.సి. రావు,  సర్పంచ్ చెన్నమనేని స్వయంప్రభ, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, ప్యాక్స్ చైర్మన్ రేగులపాటి కృష్ణదేవరావులతో పాటు అర్బన్ మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,  ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.