హోంగార్డ్ కుటుంబానికి బాసటగా  తోటి హోమ్ గార్డ్స్...

హోంగార్డ్ కుటుంబానికి బాసటగా  తోటి హోమ్ గార్డ్స్...

ముద్ర, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి :అనారోగ్యంతో మరణించిన హోంగార్డ్ కుటుంబానికి  తోటి హోమ్ గార్డ్స్ అండగా  ని లిచారు. వారి కుటుంబానికి ఆర్థిక సాయాన్ని సిరిసిల్ల పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో  ఎస్పీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా అందజేశారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తు  SK. సుబాని ఇటీవలఅనారోగ్యంతో  మరణించాడు.  దీంతో తోటి హోంగార్డ్ లు తమ ఒక రోజు వేతనం (1,48,000/- రూపాయలు) వారి కుటుంబనీకి  ఎస్పీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా  అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని, ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ది సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ యాదగిరి, హోమ్ గార్డ్ ఇంచార్జి హెడ్ కానిస్టేబుల్ రవిందర్, దేవరాజ్,రవీందర్,పౌర్ణమి ఇక్బల్ ,సుబాని కుటుంబ సభ్యులు  పాల్గొన్నారు.