బతుకమ్మ ఆడిన జీపి కార్మికులు...

బతుకమ్మ ఆడిన జీపి కార్మికులు...

ముద్ర, మల్యాల:నిరవధిక సమ్మెలో భాగంగా పంచాయతీ కార్మికులు మంగళవారం బతుకమ్మ ఆడారు. మల్యాల బ్లాక్ చౌరస్తా వద్ద గల కేసీఆర్ ప్లెక్సీ ముందు బతుకమ్మ కార్యక్రమం ఏర్పాటు చేయగా, మహిళా కార్మికులు బతుకమ్మ ఆడుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు చేస్తున్న సమ్మె 20 వ రోజుకు చేరింది. ప్రభుత్వం స్పందించే వరకు తమ నిరసన కొనసాగుతుందని కార్మికులు పేర్కొన్నారు.