నియోజకవర్గంలో అడుగుపెట్టని చెన్నమనేని

నియోజకవర్గంలో అడుగుపెట్టని చెన్నమనేని
  • ఆయన అభిమానుల కోసమైన వేములవాడ రాలేదు
  • జర్మని నుంచి వచ్చి హైదరాబాద్ కే పరిమితం
  • ప్రజాభిప్రాయం తీసుకొంది..నామీనేట్ పోస్టు ఎలా స్వీకరిస్తారు..?
  • టికెట్ మిస్సాయాక .. ఇండియా వచ్చి నియోజకవర్గ ప్రజలను కలవని ఎమ్మెల్యే సాబ్
  • వేములవాడ లో చెన్నమనేనిపై ఆయన అభిమానుల్లో అసంతృప్తి
  • టికెట్ కోసం ఇంత కొట్లాడితే.. ఎవరికి చెప్పుకుండా నామీనేట్ పోస్టును ఒప్పుకుంటారా..?
  • వేములవాడలో హాట్ టాఫీక్ గా ఎమ్మెల్యే రమేశ్బాబు స్టేట్ పోస్టు చర్చ

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల:రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు నామీనేట్ పోస్టు వ్యవహారం సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తిని రగుల్చుతుంది. వేములవాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా సుధీర్ఘకాలం ఎమ్మెల్యేగా పని చేసిని చెన్నమనేని కుటుంబానికి మంచి పేరుంది. స్వాతంత్ర సమరయోధుడు.. కమ్యూనిస్టు నేత స్వర్గీయు చెన్నమనేని రాజేశ్వరరావు వారసత్వాన్ని పుచ్చుకున్న చెన్నమనేని రమేశ్ బాబు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ప్రజల మన్ననలు పొందారు. కొన్ని సంఘటనలతో సోంత క్యాడర్లో వ్యతిరేఖత వచ్చిన.. ప్రజల్లో మంచి పేరుంది. పౌరసత్వం వివాదంలో బీఆర్ఎస్ అధిష్టానం చెన్నమనేని రమేశ్బాబుకు టికెట్ కట్ చేసి చల్మెడ లక్ష్మీనరసింహారావుకు ఇచ్చారు. రమేశ్ బాబుకు పౌరసత్వం వివాదం ఎటు తేలకముందే బీఆర్ఎస్ టికెట్ ఎందుకు కట్ చేస్తారంటూ.. చల్మెడకు టికెట్ ఇవ్దోదంటూ చెన్ననమనేని రమేశ్ బాబు అనుచరులు, ఆయన వర్గం పెద్ద గొడవకు దిగింది. సమావేశాలు ఏర్పాటు చేసి చెన్నమనేనికే టికెట్ కేటాయించాలని బీఆర్ఎస్ అధిష్టానంపై ఎర్రజెండా ఎగురవేశారు. చల్మెడకు సహకరించబోమని అధిష్టానంకు అల్టిమేటం జారీ చేశారు. వేములవాడ నియోజకవర్గంలో సోషల్ మీడియా వేదికగా చెన్నమనేనికి సపోర్టుగా పోస్టులు పెడుతూ.. చల్మెడ కు వ్యతిరేఖంగా సోషల్ వార్ నడిపించారు.

చెన్నమనేనికి మండలాల వారిగా వ్యక్తిగతంగా అభిమానించే నాయకులు, క్యాడర్ కూడా ఉంది. చెన్నమనేని రమేశ్ బాబు జర్మనీలో ఉండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ మిస్సవగా.. త్వరగా ఇండియాకు రావాలని, క్యాడర్ మొత్తం ఆందోళనలో ఉందని వాట్సప్ మేసేజ్ లు సైతం ఆయన అభిమానులు పెట్టారు. ఐన సీఎం కేసీఆర్ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ చెన్నమనేని రమేశ్బాబును కాదని చల్మెడ లక్ష్మీనరసింహారావుకే కేటాయించారు. తెలంగాణా రాజకీయ పరిస్థితులు, వేములవాడ నియోజకవర్గంలో చల్మెడకు టికెట్ కన్ఫర్మ్ కావడంతో రమేశ్బాబు క్యాడర్ లో ముఖ్యులందరు ఒక్కరక్కరుగా చల్మెడ శిబిరంలో చేరిపోయారు. పరిస్థితులను గ్రహించిన చెన్నమనేని రమేశ్ బాబు మూడు రోజుల క్రితమే జర్మని నుంచి స్వదేశం చేరుకున్నారు. జర్మని నుంచి వచ్చిన రోజే ఆయన అభిమానులను కలవడానికి.. ప్రజలతో ముఖ ముఖీ కావడానికి వేములవాడ నియోకవర్గానికి వస్తారని అందరు ఆశీంచారు. కానీ చెన్నమనేని రమేశ్ బాబు హైదరాబాద్ చేరుకున్నాక రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో నేరుగా ప్రగతి భవన్ మెట్లు ఎక్కడం.. అదే రోజు రాష్ట్ర వ్యవసాయరంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా సీఎం కేసీఆర్ పదవి ప్రకటించడం.. చెన్నమనేని ఒప్పకొని.. వచ్చిన వారితో బొకెలు తీసుకోవడంతో తీవ్ర విమర్శల పాలయ్యారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు.

ఎన్నికలకు మూడు నెలల సమయం ఉంది.. ముందుగా వేములవాడ నియోజకవర్గం చేరుకోని ఆయన అభిమానులను కలిసి.. ప్రజలతో ముఖా ముఖి అయ్యి ప్రజాభిప్రాయం తీసుకున్నాక.. రాష్ట్ర నామీనేట్పోస్టు ఒప్పుకుంటే బాగుండు అనే భవన ఆయన అభిమానుల్లో.. ప్రజల్లో చర్చ కొనసాగుతుంది. జర్మని నుంచి రావడంతోనే ప్రజలను కలవకుండా.. నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా హైదరాబాద్ కు పరిమితం అయ్యి నామీనేట్ పోస్టును ఒప్పుకోవడం ఏంటో అని వేములవాడ నియోజకవర్గంలో రాజకీయ చర్చ కొనసాగుతుంది. చెన్నమనేని రమేశ్ బాబు కోసం ఇటు అధిష్టానానికి వ్యతిరేఖులై.. చల్మెడను విమర్శించి.. ఇప్పటికి చల్మెడను కలవకుండా ఉన్న నాయకులు సైతం మదనపడుతున్నారు. నామీనేట్పోస్టు వచ్చిన తర్వాత కలవడానికి వెళ్లిన కొంత మంది ప్రజాప్రతినిధులపై కూడా చెన్నమనేని రమేశ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసి నేను వచ్చేదాక ఓపీక లేదా.. చల్మెడను అంతా త్వరగా ఎందుకు కలిశారు అని అసహనం చేసినట్లు తెలిసింది. జర్మని నుంచి హైదరాబాద్ వచ్చి చెన్నమనేని మూడు రోజులైన సోంత నియజకవర్గం వైపు తొంగి చూడకపోవడం.. ప్రజలను , ఆయన అభిమానులను కలవకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.