నిండుకుండలా ఎగువ మానేరు... నేడో, రేపు మత్తడి దూకే అవకాశం..

నిండుకుండలా ఎగువ మానేరు... నేడో, రేపు మత్తడి దూకే అవకాశం..

ముద్ర, గంభీరావుపేట : విస్తృతంగా కురుస్తున్న వర్షాలకు నర్మాల  ఎగువ మానేరు నిండుకుండలా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మలలోని ఎగువ మానేరు ప్రాజెక్టులోకి విస్తృతంగా  కురుస్తున్న భారీ వర్షాలకు పాల్వంచ, కూడవెల్లి వాగుల వరద నీరు భారీగా రావడంతో ఎగువమానేరు నిండుకుండలా మారింది.ఎగువ మానేరు నీటి నిల్వ సామర్థ్యం 31 అడుగులకు గానూ 30 అడుగులకు చేరి నీటితో తొణికిసలాడుతున్నది. వరద నీరు భారీగా రావడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నేడో, రేపు  మత్తడి దూకే అవకాశం ఉన్నది.