జలం బాగుంటేనే జనం బాగుంటారు: చెన్నామనేని వికాస్

జలం బాగుంటేనే జనం బాగుంటారు: చెన్నామనేని వికాస్

ముద్ర,రుద్రoగి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి మండల కేంద్రంలో  ప్రతిమఫౌండేషన్, ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను బుధవారం రోజున ప్రతిమ ఫౌండేషన్ అధినేత చెన్నమనేని వికాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ చెన్నమనేని వికాస్ మాట్లాడుతూ అన్ని రకాల జబ్బులకు కలుషిత నీరే కారణమని త్రాగే మంచినీరు పరిశుభ్రమైన మంచి నీటిని తీసుకోవాలని గ్రామా వాసులకు సూచించారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ముఖ్య ఉద్దేశం తో రుద్రoగి మండల కేంద్రంలో గంగపుత్ర యువజన సంఘం అభ్యర్థన మేరకు ప్రతిమ ఫౌండేషన్ ద్వారా మినరల్ వాటర్ ప్లాంటును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

ప్రతిమ ఫౌండేషన్ ద్వారా ప్రతి మండలానికి అత్యవసర సమయంలో ఆంబులెన్స్ ఉండాలనే ఉద్దేశంతో అంబులెన్స్ ప్రతి మండలానికి ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ప్రతిమ సంస్థ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు, మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజల వద్దకే డాక్టర్లు ,దవాఖాన అనే ముఖ్య ఉద్దేశంతొ ప్రతిమ మీ ముంగిట్లో అను నీనాదంతొ ప్రతిమ ఆరోగ్య రథంను తీసుకురావడం జరిగిందన్నారు.నేటి మహిళలు ఆర్థికంగా, మానసికంగా తన కాళ్ళ మీద తాను నిలవడానికి ముందుంటున్నారు. దీనిలో భాగంగా ప్రతిమ ఫౌండేషన్ వారికీ స్వయం ఉపాధి ఆర్థిక చేయూతనిస్తూ వారికి అండగా ఉంటుందన్నారు. ముఖ్యంగా యువత అన్ని రంగాలలో రాణించాలని యువతకు సూచించారు.  ఈ సందర్భంగా వికాస్, డాక్టర్ దీపా లను వారు సన్మానించారు.ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం నాయకులు,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.