సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ ను కలిసిన టీజీవోస్ ప్రతినిధులు...

సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ ను కలిసిన టీజీవోస్ ప్రతినిధులు...

 ముద్ర ప్రతినిధి,మేడ్చల్ :  రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, సి.సి.ఎల్.ఏ కమిషనర్ (సర్వే అండ్ సెటిల్మెంట్ )నవీన్ మిట్టల్ ను బుధవారం రాష్ట్ర టీజీవోస్ ( సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ ) యూనియన్  అధ్యక్షులు ఎస్. నరహరి రావు, జనరల్ సెక్రెటరీ ఎం. రాంచందర్ లు కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు . ఇటీవల రాష్ట్రంలో వీఆర్ఏ పోస్టుల క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా 420 మంది వి.ఆర్.ఏ లను కింది స్థాయి ఉద్యోగులుగా, చైన్ మన్ లు గా, నియమిస్తూ... ఉత్తర్వులు జారీ చేయటం పట్ల వారు కృతజ్ఞతలు తెలుపుతూ పుష్పగుచ్చం అందించి, శాలువాతో సన్మానించారు. 

అలాగే, సర్వే శాఖలో దీర్ఘ కాలంగా ఉన్న సిబ్బంది బదిలీల విషయం, డిపార్ట్మెంట్ రీ - ఆర్గనైజేషన్  విషయాలను కమిషనర్  దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలత వ్యక్తం చేశారని  యూనియన్ నాయకులు వెల్లడించారు. అదేవిధంగా, సర్వే శిక్షణ అకాడమీకి 14 మంది కింది స్థాయి ఉద్యోగులను చైన్ మెన్ లను  కూడా త్వరలోనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. కమిషనర్ ను కలిసిన వారిలో యూనియన్ అధ్యక్షులు ఎస్. నరహరి రావు, జనరల్ సెక్రటరీ ఎం. రాంచెందర్,  కోశాధికారి వి. శ్రీరామ్, సబ్యులు కేశవులు, మన్నంకొండ లు పాల్గొన్నారు.