బొప్పన సత్యనారాయణ రావు మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాప

బొప్పన సత్యనారాయణ రావు మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాప

ముద్ర, ముషీరాబాద్: శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ బొప్పన సత్యనారాయణ రావు ( బి.ఎస్.రావు ) మృతి చాలా బాధాకరమని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బి.ఎస్.రావు విద్యావేత్తగా శ్రీ చైతన్య విద్యా సంస్థలను ఏర్పాటు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాదిమంది యువతీ యువకులకు గుణాత్మకమైన విద్యనందించి, వారు ఉపాధి అవకాశాలు పొందేందుకు సహకరించారన్నారు. తెలుగు విద్యార్థులు అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ ఇతర ఉన్నత విద్యలకు అర్హత పొందేలా వారికి శిక్షణ కల్పించారన్నారు. కొత్త ఒరవడిలో కార్పొరేట్ పద్దతిలో మంచి అనుశాసనంతో, కష్టించి చదివే తత్వాన్ని కూడా వారు పెంపొందించారని దత్తాత్రేయ కొనియాడారు.

 వారి కృషి చిరస్మరణీయమైనదని తాను కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు వారు తనను కలిసి వంద శాతం అక్షరాస్యత సాదించేందుకు తీసుకోవలసిన చర్యలపై తనతో చర్చించారని, పేద విద్యార్థులకు కూడా ఫీజులో కన్సెషన్ ఇచ్చి సహకరించారని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.  బి.ఎస్.రావు మృతి విద్యారంగానికి తీరని లోటు అని, వారి మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని, ఈ కష్టకాలంలో వారి కుటుంబ సభ్యులు బాధను తట్టుకోవడానికి శక్తిని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు బండారు దత్తాత్రేయ తెలిపారు.