రాష్ట్ర మాజీ గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల  సామేల్ కాంగ్రెస్ లో చేరనున్నారా?

రాష్ట్ర మాజీ గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల  సామేల్ కాంగ్రెస్ లో చేరనున్నారా?
  • కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్ళనున్నారా? 

తుంగతుర్తి ముద్ర:-తుంగతుర్తి నియోజకవర్గంలో సీనియర్ రాజకీయ నేత మాజీ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామెల్ ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ లో చేరనున్నారా ?చేరిక కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ సమక్షంలో ఉన్నట్లు తెలుస్తోంది. బిఆర్ఎస్ పార్టీలో మాదిగలకు అన్యాయం జరుగుతుందని తనకు గత రెండుసార్లు ప్రస్తుతం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ సీటు దక్కకపోవడంతో ఏకంగా పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం విధితమే .రాజీనామా అనంతరం నియోజకవర్గంలో నీ తన  అనుయాయులతో నాడు ఉద్యమ కాలంలో తమతో పాటు పనిచేసిన వారితో సమావేశాలు చర్చోపచర్చలు జరిపి చివరగా తుంగతుర్తిలో భారీగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తను ఏ పార్టీలోకి వెళితే తనకు న్యాయం జరుగుతుందో అలాగే ఏ పార్టీతో కలిసి పనిచేస్తే బీఆర్ఎస్ అభ్యర్థిని సులభంగా ఓడించవచ్చు అని లెక్కలు వేసుకుని చివరగా కాంగ్రెస్ బలంగా ఉందని ఆ పార్టీలో చేరితేనే తన లక్ష్యం నెరవేరవచ్చని భావించి కాంగ్రెస్ లో చేరికకు సిద్ధమైనట్లు సమాచారం .కాంగ్రెస్లో ఇప్పటికే డజన్ మంది ఆశావాహులు టికెట్ రేసులో ఉండగా మందుల సామేల్ టికెట్ ఆశించి కాంగ్రెస్లో చేరుతారా ?లేక టికెట్ దక్కిన దక్కకపోయినా పార్టీలో చేరి తన లక్ష్యం బిఆర్ఎస్ అభ్యర్థి ఓటమికి కృషి ? అనేది చర్చనీయాంశంగా మారింది లేక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏదైనా ఉన్నత పదవి ఇచ్చే హామీతో చేరుతారా? ఏది ఏమైనా మందుల సామెల్ చేరిక కాంగ్రెస్ పార్టీకి లాభమే చేకూరుతుందని మాట వినవస్తోంది .మందుల సామేలు చేరే వేదిక ఖరారు అయినట్లు సమాచారం .చేరిక ఏ హామీతో అనేది చేరిక తర్వాత తేలుతుందనే మాట వినవస్తోంది .మందులో సామేల్ కాంగ్రెస్ లోకి వస్తే మిగతా ఆశావహుల తీరు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.