కామన్ సివిల్ కోడ్ రాజ్యాంగ విలువలకు విరుద్ధం

కామన్ సివిల్ కోడ్ రాజ్యాంగ విలువలకు విరుద్ధం
  • సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు- గన్నా చంద్రశేఖర్

హుజూర్ నగర్ టౌన్ ముద్ర:కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న కామన్ సివిల్ కోడ్ రాజ్యాంగ విలువలకు విరుద్ధమని సిపిఐ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా సమితి రాజకీయ శిక్షణ తరగతులను హుజూర్ నగర్ లో ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వం భారత దేశంలో మనుసూత్రాల ఆధారంగా పరిపాలన జరిగిందని బ్రిటిష్ పరిపాలన అనంతరం దేశం స్వతంత్రం సాధించిన తర్వాత విభిన్న ప్రజల అకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రూపొందించుకున్నామని అన్నారు. బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగ సూత్రాలకు తూట్లు పొడిచిందన్నారు. సమకాలీన ప్రపంచంలో ధనిక పేద తారతమ్యాలు ఎక్కువయ్యాయని దీనిని పోగొట్టి సమానత్వాన్ని సాధించాలంటే కమ్యూనిజమే మార్గమని అన్నారు. కార్యక్రమంలో మహిళా సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెలసృజన, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లవుల రాములు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కంబల శ్రీనివాస్, దేవరం మల్లేశ్వరి ,పాలకూరి బాబు, దూళిపాల ధనుంజయ నాయుడు, సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ ,దొంతకాని సత్యనారాయణ పాల్గొన్నారు.